April 21, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

క్షణ క్షణం సినిమా పెద్ద హిట్ కావాలి : అల్లు అరవింద్

మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు నిర్మించిన సినిమా క్షణ క్షణం. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్షణక్షణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత అల్లు అరవింద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ….నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం శ్రీరామ్ గారు. ఆయన నాకు గురు సమానులు. వారి అబ్బాయి ఉదయ్ హీరోగా నటిస్తున్న ఈ క్షణ క్షణం సినిమా బాగుందని విన్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన అందరూ నటీనటులకు టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నిర్మాతగా మారిన డాక్టర్ వర్లు గారు మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ…నిర్మాత అల్లు అరవింద్ గారు, సంగీత దర్శకులు కోటి గారు, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వడం సంతోషం. పర్సనాలిటీ డెవలప్ మెంట్ టీచర్ అయిన నేను నిర్మాతగా మారడానికి కారణం మా గురువు శ్రీరామ్ సార్. ఆయన కోసం వారి అబ్బాయి ఉదయ్ తో నేను నిర్మాతగా మారి క్షణ క్షణం సినిమా తీశాను. సినిమాల పట్ల ఆసక్తితో ఉదయ్ నటుడయ్యాడు, తను మంచి నటుడితో పాటు మంచి మేధావి. ఈ సినిమా విషయానికి వస్తే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ థ్రిల్స్ ఫీల్ అవుతారని తెలిపారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…క్షణం క్షణం నా మూడో సినిమా. అనుకోకుండా విన్న ఈ సినిమా నాకు బాగా నచ్చింది. నాకు నటన పరంగా ఎక్కువ స్కోప్ ఉన్న కథ ఇది. ఈ సినిమా నేనెందుకు చేయకూడదని అనిపించి వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేశాము. కేవలం ఇరవై ఆరు వర్కింగ్ డేస్ లో సినిమా ఫినిష్ చేశాము. మాకు సపోర్ట్ చేసిన అల్లు అరవింద్ గారికి బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. వెంకటేష్ గారు మా సినిమా బాగుందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా థియేట‌ర్స్ వ‌ర‌కూ వ‌స్తుందంటే అల్లు అర‌వింద్ గారి స‌పోర్ట్ తోనే సాధ్యం అయ్యింది. ఫిబ్రవరి 26న వస్తున్న మా క్షణ క్షణం చూసి అందరూ ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నట్లు తెలిపారు.

డైరెక్టర్ మేడికొండ కార్తిక్ మాట్లాడుతూ…ఈ ఈవెంట్ కు వచ్చిన అందరికి ధన్యవాదాలు. ఈ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకున్న నిర్మాత వర్లు గారికి, మ‌న్నెం చంద్ర‌మౌళి గారికి థాంక్స్. ఇలాంటి స్క్రిప్ట్ ని ఎంచుకోవ‌డానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం మా ప్రొడ్యూస‌ర్స్ కి ఉంది. హీరో ఉదయ్ ఈ సినిమాను నమ్మి చేశాడు. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న క్షణ క్షణం సినిమా ఎవ్వరిని డిజప్పాయింట్ చెయ్యదు. మా సినిమాను మీ అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

దర్శకుడు రామరాజు మాట్లాడుతూ…నాకు చంద్రమౌళి ఆప్తుడు. నా మల్లెలతీరం సినిమా, ఒక మనసు సినిమాలు అంతగా ప్రజల్లోకి వెళ్లాయంటే కారణం ఆయనే. ఈ సినిమా ప్రయాణంలో నాకు పరిచయం అయిన మరో గొప్ప వ్యక్తి డాక్టర్ వర్లు గారు. నాకు ఈ సినిమా గురించి గత ఆర్నెళ్లుగా చెబుతూనే ఉన్నారు. మౌళి గారికి సినిమా మీద చాలా అవగాహన ఉంది. చాలా ఇన్వాల్వ్ అయి, అందంగా సినిమాను చేశారు. మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు. ఉదయ్ శంకర్ గారు మేథమెటిక్స్ లో మాస్టర్…ఆయన సినిమా వైపు వచ్చారంటే ఏదో దైవిక ఆలోచన ఉండాలి. మీరు సినిమా ప్రాసెస్ ను ఎంజాయి చేసి ఉంటారు. మౌళి గారికి వర్లు గారికి మీకు అందరికీ నా బెస్ట్ విశెస్. అన్నారు.

ఎడిటర్ గోవింద్ మాట్లాడుతూ…స్క్రీన్ ప్లే బాగుంటే ఎడిటింగ్ కూడా బాగుంటుంది. క్షణక్షణం సినిమాకు మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు కార్తీక్ గారు. అలాగే నాకీ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డాక్టర్ వర్లు గారికి, మౌళి గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. 26వ తేదీన సినిమా చూసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ…ప్రతి ఒక్కరి జీవితంలో కొందరు హీరోలుంటారు. నా జీవితంలో అలాంటి హీరో అల్లు అరవింద్ గారు. సినిమా పిచ్చోడి చేతిలో రాయి కాదు గమ్యం, గమనం సరిగ్గా ఉంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని అరవింద్ గారు నిరూపించారు. ఎంతోమంది రీల్ హీరోలను తయారుచేశారు. గెలుపు ఓటమి అనే రెండు పదాలకు నిర్వచనం, అర్థం లేదు. గెలవడం అంటే యుద్ధానికి సిద్ధం కావడం. ఆ తర్వాత ఓడామా గెల్చామా అనేది ముఖ్యం కాదు. ఒకడు యుద్ధానికి సిద్ధమయ్యాడూ అంటే గెల్చినట్లే లెక్క. ఇలా ఒక ఇష్టాన్ని అనుసరిస్తూ సినిమా చేసిన ఉదయ్ ఇప్పటికే గెలిచేశాడు. ఇక కమర్షియల్ లెక్కలు అవీ తర్వాత, తన లక్ష్యం వైపు అతను వేసిన అడుగే గెలిచినట్లు చేసింది. ఉదయ్ పట్టుదల ఉండి శ్రమించే వ్యక్తి. అతనికి నా ఆశీస్సులు ఉంటాయి. ఉదయ్ మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో పనిచేసిన నా మరో ఆత్మీయుడు సంగీత దర్శకుడు కోటి. మా ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. రోషన్.. తండ్రి కోటి లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడు. మంచి మ్యూజిక్ చేశాడు. డాక్టర్ వర్లు గారితో నాకు పరిచయం లేదు గానీ ఆయనతో ఎప్పటినుంచో స్నేహం ఉన్న అనుభూతి కలుగుతోంది. క్షణక్షణం సినిమాలో ఏదో విషయం ఉంది. ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తోంది. అన్నారు.

హీరోయిన్ జియా శర్మ మాట్లాడుతూ :
అర్జున్ రెడ్డి తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందగలిగాను. క్షణ క్షణం తో మరింత దగ్గర అవుతాననే నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తికేయ, నిర్మాతలు వర్లు, చంద్ర మౌళి లకు థాంక్స్. మరిన్ని తెలుగు సినిమాలలో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. క్షణ క్షణం మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. 26న థియేటర్లలో లో కలుద్దాం. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies