దుబాయ్ లో సర్కారు వారి పాట
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ `ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్` అంటూ ఒక వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ – “సర్కారు వారి పాట` మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు గారిని డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ళ నా కల ఈ రోజు నిజమైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకుల, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్.ఎస్ మాట్లాడుతూ – “సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం: తమన్ ఎస్.ఎస్,
సినిమాటోగ్రఫి: మధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్,
పిఆర్ఓ: బి.ఏ.రాజు,
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్,
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.