సాయి తేజ్- దేవా కట్ట ల రిపబ్లిక్ ?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రానికి రిపబ్లిక్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు టీం ప్రకటించింది. దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు సోమవారం విడుదల చేసారు. జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ బిన్నంగా ట్రెండీగా ఉంది. ఇక సినిమాకు సంబందించిన సమాచారం ఏది ఇవ్వలేదు.. కానీ పోస్టర్ లో చుస్తే.. పెద్ద కళ్ళజోడు.. అందులో జనాలు కనిపిస్తున్నారు.. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్టు తెలిసింది. లేటెస్ట్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో వచ్చిన సాయి తేజ్ నటిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.