నందమూరి వారసుడి ఎంట్రీ ఎప్పుడో తెలుసా ?
నందమూరి అందగాడు నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం గత కొన్ని రోజులుగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ఫాన్స్ కోరుకుంటుంటే, మోక్షజ్ఞ మాత్రం .. సినిమాల విషయంలో పెద్దగా ఆసక్తిగా లేదని, ఆయనకు ఎక్కవుగా బిజినెస్ వ్యవహారాల్లో ఆసక్తి కాగలడంతో సినిమాలు చేయనని చెప్పినట్టు కూడా ఇదివరకు వార్తలు వచ్చాయి.. కానీ ఫైనల్ గా నందమూరి వారసుడి ఎంట్రీ ఖరారయినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బాలకృష్ణ ను ఎవరడిగానా.. అతని ఎంట్రీ 2022లో ఉంటుందని చెబుతూ వస్తున్నాడు బాలయ్య. ఆ మధ్య ఓ వేడుకలో కనిపించిన మోక్షజ్ఞ ఫోటో చూసి అందరు షాక్ అయ్యారు. ఏమాత్రం గ్లామర్ విషయం పట్టించుకోకుండా లావుగా కనిపించాడు, వామ్మో బాలయ్య వారసుడు ఎంటీ ఇలా అయిపోయాడు.. పాతికేళ్లకే అంకుల్ అంటూ సెటైర్లు కూడా పేలాయి. దాంతో నందమూరి అభిమానులు కూడా బాలయ్య వారసుడిపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే అమెరికాలో ఉన్న ఒక యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ కు మోక్షజ్ఞను బాలయ్య పంపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా తన ఫిజిక్ పై దృష్టి పెడుతున్నాడట. సిక్స్ ప్యాక్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి మోక్షజ్ఞ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేదానికి సమాధానం సినిమాల్లోకి వస్తుండడమే అని వినిపిస్తుంది.