Popular singer Karthik live in consort who was thrilled at TKR College Fest
1 min readహైదరాబాద్: నగరంలోని మీర్ పేట లో గల టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాల 22వ వార్షిక దినోత్సవ వేడుకను పురస్కరించుకుని క్యాంపస్ ఆవరణలో నిర్వహించింది. ఇందులో భాగంగా షిజ్నే 2024 – టీకేఆర్ కాలేజ్ ఫెస్ట్ లో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ కార్తీక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ జరిగింది. విద్యార్థులతో క్యాంపస్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కార్తీక్ తన ప్రసిద్ధ పాటలైన తెలుగు పాటలతో ఈ మ్యూజికల్ నైట్ ను ప్రారంభిస్తూ తన పాటలతో వీక్షకులను ఉర్రూతలూగించారు. కార్తీక్ పాటకు విద్యార్ధులు స్వరం కలుపు తూ, డాన్స్ తో సరగదా ఎంజాయ్ చేశారు. ఆయన స్వర రాగ సంగీత
పాటలతో యువత మదిని దోచారు. కార్తీక్ తన
హిట్లైన తెలుగు కొన్ని పాటలను పాటలతో అలరిస్తూ విద్యార్థులను ఉత్సాహపరుస్తూ జోశ్ ని నింపారు. తన మ్యాజికల్ గాత్రం తో వీక్షక విద్యార్థుల హృదయాలను దోచుకున్నాడు.
కాలేజ్ ఫెస్ట్ వార్షికోత్స
వాన్ని పురస్కరించుకుని మొదటి రోజు త్యోహర్ (సాంప్రదాయ రోజు) వంటి కరిక్యులర్, కో-కరిక్యులర్ కార్యక్రమా లతో జరుగుతున్నాయని, ఇందులో భాగంగా విద్యార్థులు, కళాశాల సిబ్బంది వివిధ సంస్కృతులు, సంప్రదాయాలను సూచించే సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి రెండవ రోజు లైవ్ ఇన్ కన్సర్ట్లతో పాటు మూడవ రోజురక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా మరియు అతనితోపాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ అనిత రెడ్డి పాల్గొన్నారు మూడు రోజులు పాటు ఫెస్ట్ జరుపుకుంటున్నారని కళాశాల కార్యదర్శి హరి నాథ్రెడ్డి తెలిపారు. అంతకు ముందుకు గాయకుడు కార్తీక్, టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి, కోశాధికారి అమర్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు