ఫిబ్రవరి 5 జాంబీ రెడ్డి వస్తున్నాడు
1 min readడైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’తో తేజ సజ్జా హీరోగా పరిచయమవుతున్నారు. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదివరకు సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు విడుదలను ఫిబ్రవరి 5కు మార్చారు.
ఈ విషయాన్ని ఓ వీడియో బైట్ ద్వారా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. “అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మొత్తం ‘క్రాక్’ టీమ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. సంక్రాంతికి విడుదలవుతున్న తదుపరి చిత్రాలకు ఆల్ ద బెస్ట్. ‘జాంబీ రెడ్డి’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాం. ఆ విషయాన్ని ఇప్పటికే అనౌన్స్ చేశాం. ఈ విషయంలో నాకు పలు ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. సినిమాను పోస్ట్‌పోన్ చేయాల్సిందిగా ఇండస్ట్రీ పెద్దలు సూచించారు. వారి సూచన మేరకు ‘జాంబీ రెడ్డి’ని మేం క్వారంటైన్‌లో పెట్టాం. త్వరలోనే, ఫిబ్రవరి 5న ‘జాంబీ రెడ్డి’ థియేటర్లకు వచ్చి, మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి థియేటర్లకు రండి. ఫిబ్రవరి 5వ తేదీని గుర్తుంచుకొని, థియేటర్లలోనే ఫిల్మ్‌ను చూడండి.” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మరో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మన ముందుకు వస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావడం గమనార్హం.
నూతన సంవత్సరారంభం సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘జాంబీ రెడ్డి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలను అందుకొనేందుకు ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: రాజశేఖర్ వర్మ
బ్యానర్: యాపిల్ ట్రీ స్టూడియోస్
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే
సినిమాటోగ్రఫీ: అనిత్
మ్యూజిక్: మార్క్ కె. రాబిన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగల
ఎడిటింగ్: సాయిబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
పీఆర్వో: వంశీ-శేఖర్.