May 26, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

‘Premedeshpu Yuvarani’ Movie Youthful Romantic Entertainer —Movie Review

“ప్రేమదేశపు యువరాణి” మూవీ రివ్యూ

రేటింగ్ : 3.25/5

నటీనటులు
మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు.

సాంకేతిక నిపుణులు
కెమెరా: శివకుమార్‌ దేవరకొండ,
సంగీతం: అజయ్‌ పట్నాయక్‌,
ఎడిటర్‌: ఎం.ఆర్‌. వర్మ
పాటలు: కాసర్ల శ్యామ్‌, సాయి సునీల్‌ నిమ్మల, భాను–కృష్ణ,
సౌండ్‌ మిక్స్‌: జయంతన్‌ సురశ్‌
కొరియోగ్రఫీ: కపిల్‌, శ్రీవీర్‌
సౌండ్‌ ఎఫెక్ట్స్‌: పురుషోత్తం రాజు,
ఫైట్స్‌: శివ్‌రాజ్‌
డిఐ: వెంకట్‌
స్టిల్స్‌ జగన్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహి
మేకప్‌: అనిల్‌, భాను
పీఆర్వో: మధు విఆర్‌
పబ్లిసిటీ డిజైనర్‌: ఎంకెఎస్‌ మనోజ్‌
పోస్ట్‌ ప్రొడక్షన్స్‌: సారథి స్టూడియోస్‌
నిర్మాతలు: ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌
రచన – దర్శకత్వం: సాయి సునీల్‌ నిమ్మల.

ఏజీఈ క్రియేషన్స్‌. ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చింది. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
అమలాపురంలో వీరయ్య అనే రౌడీ షీటర్ చాలామంది ప్రజలను ఇబ్బంది పెడుతూ ఎదురు తిరిగిన వారిని, వారి కుటుంబాన్ని మర్డర్స్ చేస్తూ.. నచ్చిన అమ్మాయిలను మానభంగం చేస్తూ వీరంగం చేస్తుంటాడు. అయితే అదే ఊర్లో బి.టెక్ పూర్తి చేయలేక ఏడు సబ్జెక్టు లలో ఫెయిల్ అయ్యి తండ్రి తో తిట్లు తింటూ ఎటువంటి గోల్స్ లేక ఫ్రెండ్స్ తో తాగుతూ జూలాయిగా తిరుగుతున్న చెర్రీ (యామిన్‌ రాజ్‌) కు శ్రావణి (ప్రియాంక రేవ్రి) కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు తనే ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అవుతాడు. నాకు తెలియని ఇంత అందగత్తె ఈ ఊర్లో ఎవరని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటాడు. రావులపాలెం నుండి ఉద్యోగ రీత్యా శ్రావణి కుటుంబం అమలాపురంకు వచ్చిందని శ్రావణి తండ్రి, చెర్రీ తండ్రి ఇద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఆ తరువాత శ్రావణితో మాటలు కలుపడంతో తను ఫెయిల్ అయిన 7 సబ్జక్ట్స్ కు ట్యూషన్ చెప్పి హెల్ప్ చేస్తాను అంటుంది. ఆలా మొదలైన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. చివరకు పెళ్లి చేసుకుందాం అన్న చెర్రీ మాటలకూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాను, కలెక్టర్ తో పాటు నాకు చాలా గోల్స్ ఉన్నాయి పెళ్లి చేసుకొనని చెపుతుంది. పెళ్ళి ఎందుకు వద్దంటున్నావ్ అని నిలదీసిన చెర్రీ కు రవి (విరాట్‌ కార్తిక్‌)ను ఇష్టపడ్డానని చెపుతుంది. దాంతో షాక్ అయిన చెర్రీ శ్రావణి ప్రేమను దక్కించు కోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు.

మరో వైపు అదే ఊరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి.. ఈ మర్డర్స్ అన్ని కూడా డిఫరెంట్ వెపన్స్ తో రౌడీ షీటర్ వీరయ్య మనుషులు చనిపోతూ ఉంటారు. ఈ మర్డర్స్ గురించి ఎంక్వయిరీ చేయిస్తున్న యస్. ఐ శంకర్ ఇవన్నీ ఒక అమ్మాయి రూపంలో ఉండే భద్ర కాళీ చేస్తుందని తెలుసుకొని షాక్ అవుతాడు. ఈ మర్డర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే తెలుసుకుంటుండగానే రౌడీ షీటర్ వీరయ్య తో పాటు తన కొడుకు భైరవ్ లు కూడా హత్య గావింపబడతారు. ఈ హత్యల వెనుక ఉన్న భద్ర కాళీ ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది? అసలు ఈ రవి ఎవరు? తనకు శ్రావణి ఎందుకు దూరంగా ఉంది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న తను కలెక్టర్ అవుతుందా? చివరకు శ్రావణి చెర్రీ కు దగ్గరైందా? లేక రవికి దగ్గరైందా? అనే ట్విస్ట్‌ ఏంటనేది
తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “ప్రేమదేశపు యువరాణి” సినిమాను తెరపై చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు ——చెర్రీ పాత్రలో నటించిన (యామిన్‌ రాజ్‌) తన హావ భావాలతో పాటు, మాటలు,పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్ లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు.శ్రావణి పాత్రలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక రేవ్రి) తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది.తన నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు.రవి పాత్రలో లెక్చరర్ నటించిన విరాట్‌ కార్తిక్‌ అటు లెక్చరర్ గా ఇటు ఉరి జనాలకు ఏ కష్టం వచ్చినా ముందుండే పాత్రలో చక్కగా నటించాడు. హీరోకు ఫ్రెండ్స్ గా నటించిన మెహబూబ్‌ బాషా, బండ సాయి, బక్క సాయి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీరయ్య పాత్రలో సందీప్‌ క్రూరమైన విలన్ గా చాలా చక్కగా నటించాడు..తన కొడుకుగా భైరవ్ పాత్రలో పవన్ కూడా బాగా నటించాడు. హీరో తల్లి తండ్రులుగా హరికృష్ణ, సునీత మనోహర్‌ లు నటన బాగుంది. ఇంకా ఇందులో యోగి కద్రి, రఘు, ముత్యాల, రాజారెడ్డి, స్రవంతి, , ప్రత్యూష, గోపీనాయుడు.
వంటివారు తమ పరిదిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు.పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో శంకర్ గా నటించిన రాజారెడ్డి నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు, క్రైమ్‌ను సాల్వ్ చేసే విష‌యంలో పోలీసుల ఇన్వేస్టిగేష‌న్, వారి ఆలోచ‌న తీరు, వారు వేసే ఎత్తులు, ఎలా ఉంటాయనే సన్నివేశాల్లో సహజమైన నటనతో పాటు పాత్రలో ఒదిగిపోయాడు. వీరయ్య పాత్రలో సందీప్‌ క్రూరమైన విలన్ గా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. విలన్ గా వీరయ్య, పోలీస్ ఆఫీసర్ గా శంకర్ లకు ఇది మొదటి సినిమా అయినా సీనియర్ యాక్టర్స్ లా కథను తన బుజాలపై వేసుకొని చాలా చక్కగా నటించారు. వారు చేసిన పెర్ఫార్మన్స్ కు ఇండస్ట్రీ కి మంచి ఆర్టిస్టులు లభించారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు ——డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ను ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ లాంటి ఆసక్తికర సన్నివేశాలతోచక్కని కథను రాసుకొని ఇందులో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని,కుల్లి కామెడీ గాని లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు సాయి సునీల్‌ నిమ్మల సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.అజయ్‌ పట్నాయక్‌ అద్భుతమైన సంగీతం అందించారు.బంగారం బంగారం నా నుదిటిరాత మార్చే బంగారం, ,తొలిముద్దు ‘మసకతడి’ ‘నిశబ్దం’, అరెరే అరెరే ఆకాశానికి నిచ్చేనవేశానా… ఎగిరే ఎగిరే తరాజువ్వాయి తననే చేరానా..,,విన్నూత రీతిలో సాగే తాగేసిపో అనే ఐటమ్ సాంగ్ లాంటి పాటలు బాగున్నాయి. ఆర్‌పీ, పట్నాయక్‌, సునీత గారు పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.శివకుమార్‌ దేవరకొండ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎం.ఆర్‌. వర్మ ఎడిటింగ్ పనితీరు బాగుంది.ఏజీఈ క్రియేషన్స్‌. ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘ప్రేమదేశపు యువరాణి’ సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.డైరెక్టర్ సాయి సునీల్‌ నిమ్మల కిది తొలి సినిమా అయినప్పటికీ డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ను ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ లాంటి ఆసక్తికర సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా కొనసాగిస్తూ చక్కటి కథ, స్క్రీన్ ప్లే, తో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని,కుల్లి కామెడీ గాని లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంతో పాటు కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో కూడా దర్శకుడు సాయి సునీల్‌ నిమ్మల సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. శివకుమార్‌ దేవరకొండ కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies