రణబీర్ చిత్రంలో ప్రొడ్యూసర్ బోనీకపూర్
1 min read
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన AK Vs AK చిత్రం లో అతిథి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం బహుళ భాషలలో నిర్మాణంలో ఉన్న పలు చిత్రాలతో నిర్మాతగా బిజీగా ఉన్న బోనీ కపూర్‌కు ఇప్పుడు నటుడిగా కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ బోనీ కపూర్ లవ్ రంజన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారు బోనీ.