రానా నెం.1 యారి కొత్త సీజన్ స్టార్ట్ !!

రీసెంట్‌గా క్రాక్, కలర్ ఫొటో వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు సమంత అక్కినేని హోస్ట్‌గా చేసిన సామ్ జామ్ టాక్‌షోతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మరో బిగ్గెస్ట్ షో నెం.1 యారీతో సందడి చేయడానికి సిద్ధమైంది. జెమినీ టీవీలో ఇప్పటి వరకు నెం.1 యారీ షోస్ మూడు సీజన్స్ ప్రసారమయ్యాయి. ఈ మూడు సీజన్స్‌కు రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడు జెమినీ టీవీ నుంచి స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్న ఆహా యూనిక్ గెస్ట్స్, ఫన్ షోస్ కంటెంట్‌తో నెం.1 యారీ న్యూ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్వాహకులు తెలియజేశారు. మూడు రెట్లు స్నేహం, ఫన్‌తో కూడిన ఈ షో టీజర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు.
రు.365 సబ్ స్క్రిప్షన్‌తో అతి కొద్ది సమయంలోనే తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచంలో ఆహా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానించే సూపర్‌స్టార్స్ నటించిన క్లాసిక్ సినిమాల కలెక్షన్స్‌తోపాటు ఒరిజినల్స్ కలెక్షన్స్ ఆహా సొంతం.