June 4, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న A రాపిడ్ ట్రైలర్

1 min read

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోస్ అన్నీ అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైలర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. అలాగే చిత్రంలోని కొంత భాగాన్ని చూసిన విజయ్ సేతుపతి.. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలపడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రాపిడ్ కట్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

‘‘యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగిరాలేనిదైనా నాకు సంతోషమే..’’ అంటూ ఇంటెన్స్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కిందో తెలిపేలా ఉంది. విభిన్న చిత్రాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ ఇవ్వబోతుంది అనేలా ఈ రాపిడ్ ట్రైలర్‌ను కట్ చేశారు. ట్రైలర్ చూసిన ఎవరైనా.. ఖచ్చితంగా థ్రిల్ అవ్వడంతో పాటు సినిమా కోసం వెయిట్ చేయడం ఖాయం. ఈ తరహా చిత్రం ఈ మధ్య కాలంలో అయితే రాలేదు అనేలా ఈ ట్రైలర్ చెప్పేస్తోంది. అలాగే ఈ ట్రైలర్‌తో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలవబోతుందనే విషయం అర్థమౌతోంది. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని PVR పిక్చర్స్ వారు గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించగా అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

నితిన్ ప్ర‌స‌న్న‌, ప్రీతి అస్రాని త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ),
సౌండ్ డిజైన్: బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ),
సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్),
ఎడిటింగ్: ఆనంద్ పవన్, మ‌ణి కందన్ (ఎఫ్‌టిఐఐ),
సంగీతం: విజయ్ కురాకుల,
నిర్మాత: గీతా మిన్సాల
దర్శకత్వం: యుగంధర్ ముని.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *