జనవరి 1న రవితేజ క్రాక్ ట్రైలర్
1 min read
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ మొత్తం పాటలతో సహా పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈలోగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జనవరి 1న చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనుంది. ఇది రవితేజ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ, శ్రుతి హాసన్ హుషారుగా ఓ పాటలో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. రవితేజ బ్లాక్ డ్రెస్‌లో ఎప్పట్లా ఫుల్ ఎనర్జీతో కనిపిస్తుంటే, శ్రుతి అల్ట్రా మోడరన్ లుక్‌లో అలరిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ చూస్తుంటే రేపు థియేటర్లలో ఆడియెన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.
ఎస్. తమన్ సంగీతం సమకూర్చగా, ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సంగీత ప్రియులను అమితంగా అలరించాయి. చివరగా రిలీజ్ చేసిన “కోరమీసం పోలీసోడా..” పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను రవితేజ, శ్రుతి హాసన్‌లపై చిత్రీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలున్నాయి. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
తారాగణం:
రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: బి. మధు
బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పాటలు: రామజోగయ్య శాస్త్రి