June 2, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

థియేటర్లనూ వదలనంటున్న డర్టీ హరి

ఇటీవల ఏ. టి. టి మరియు ఓ.టి.టి వేదికలపై విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన డర్టీ హరి జనవరి 8 న థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. అనేక ఊహాగానాల మధ్య విడుదలై విమర్శల ప్రశంసలు అందుకున్న డర్టీ హరి ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం లో అడల్ట్ టచ్ తో థ్రిల్లింగ్ మరియు ఎమోషనల్ కథనాల్ని ఉత్కంఠ భరితంగా తెరకెక్కించి రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.  కొత్త హీరో శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ లని హీరో హీరోయిన్లు గా చూపిస్తూ ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ “మా డర్టీ హరిని ఇంత పెద్ద సక్సెస్ ని చేసిన సినీ అభిమానులందరికి కృతఙ్ఞతలు. మామూలుగా ఏ చిత్రమైనా థియేటర్లలో విడుదలయ్యాక ఏ. టి. టి మరియు ఓ.టి.టి వేదికలపైకి చేరతాయి కానీ మా డర్టీ హరి విషయంలో పూర్తిగా భిన్నంగా జరిగింది. ముందు ఏ. టి. టి వేదికపై విడుదలయ్యి అద్భుతమైన రెస్పాన్స్ సాధించి, ఆ తరువాత ఆహా ఓ.టి.టి వేదికపై విడుదలయ్యి మంచి ప్రశంసలందుకుంటుంది. అయితే చిన్న తెరలపై ఇచ్చిన థ్రిల్లింగ్ అనుభూతిని పెద్ద తెరలపై అందరికీ ఇవ్వాలని మా డర్టీ హరిని ఎస్.పి.జె క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకి జనవరి 8 న థియేటర్లలో విడుదల చేయనున్నాం.” అన్నారు.

తారాగణం: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ ఈ చిత్ర ప్రధాన తారాగణం.

సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి
సమర్పణ: గూడూరు శివరామకృష్ణ
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి
రచన – దర్శకత్వం: ఎం.ఎస్.రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *