September 26, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

జనవరి 1న షకీలా వస్తోంది

1 min read


షకీలా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం. 1990లో ఖ్యాతి గడించిన దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన శృంగార తార యొక్క నిజజీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. అప్పట్లో ఆమె చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ఉండేది. ప్రతి వారం ఆమె సినిమాలు విడుదలై పరిశ్రమలోని అగ్ర తారలకు గట్టి పోటీ ఇచ్చేవి.

ఈ చిత్రానికి ఇంద్ర‌జీత్ లంకేశ్ ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రీచా చెడ్డ, పంక‌జ్ త్రిపాటి, ఎస్త‌ర్ నోర‌న్హ‌, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్ మ‌రియు సందీప్ మ‌ల‌ని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షకీలా చిత్రాన్ని హిందీలో చిత్రీకరించి అన్ని భాష‌ల‌లో అనువ‌దించ‌డం జరిగింది. UFO MOVIEZ హిందీ / తమిళ & కన్నడ వెర్షన్‌ను 25 డిసెంబర్ న పాన్ ఇండియా లెవ‌ల్లో 900ల‌కు పైగా స్క్రీన్‌లలో విజయవంతంగా విడుదల చేసింది.

ప్ర‌స్తుతం ష‌కీలా తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుద‌లైంది. ఈట్రైలర్ లో షకీలా ప‌డ్డ కష్టాలు, ఆమెకు తన సొంత కుటుంబ సభ్యుల నుండి వ‌చ్చిన విమర్శలు, అవమానాలు మరియు ద్రోహాలను చూపించారు. ఈ ట్రైల‌ర్‌లో రీ చా చడ్డా, పంకజ్ త్రిపాఠి న‌ట‌న ఆక‌ట్టుకుంది. డిజిటల్ సినిమా రంగంలో అగ్రశ్రేణి సంస్థ యుఎఫ్‌ఓ మూవిజ్ ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. 2021 జనవరి 1 న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా థియేట‌ర్‌ల‌లో షకీలా గ్రాండ్ రిలీజ్ కానుంది.

సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రకాష్ పళని సమర్ప‌కులు. సుందీప్ మలాని అసోసియేట్ నిర్మాత. , డిఓపి సంతోష్ రాయ్ పత‌జే, ఎడిటింగ్ బల్లు సలుజ. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి రాశారు. ఇట్స్ సామిస్ మ్యాజిక్ సినిమా, ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ మరియు పళని ఇంటర్నేషనల్ మీడియా వర్క్స్ ప్రెజెంటేషన్.

ఈ చిత్రం కేరళ నేపథ్యానికి సరిపోయేలా కర్ణాటకలోని తీర్థహల్లిలో చిత్రీకరించబడింది. ఈ చిత్రం చాలావరకు బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జ‌రిపారు. ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయి, వీటిలో టైటిల్ సాంగ్ బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ కంపోజ్ చేశారు. మిగిలిన రెండు పాటలు వీర్ సమర్త్ స్వ‌ర‌ప‌రిచారు.

స్టాంగ్ లాంగ్వేజ్‌, బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషలలో సెన్సార్ బోర్డు కమిటీ ప్రశంసించింది. సినిమా థీమ్ మరియు అద్భుతమైన సందేశానికి వారి నుండి ప్ర‌శంస‌లు ల‌భించాయి.

ఈ సినిమా పాటలు జీ మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *