May 23, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

‘Sound Party’ Teaser gets praises from Director Sampath Nandi

4 min read
డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది చేతుల మీదుగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ `సౌండ్ పార్టీ` టీజ‌ర్ లాంచ్‌

బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా  ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ.  హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్.  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.  ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో  డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ` టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా సంప‌త్  నంది మాట్లాడుతూ…“నేను కూడా గ‌తంలో కొన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించాను. అదే బాట‌లో జ‌య‌శంక‌ర్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హరిస్తున్నాడు.  ఈ ట్రెడిష‌న్ ని ఇలాగే కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నా.  `సౌండ్ పార్టీ` టీజ‌ర్ బావుంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బావుంది. ఈ చిత్రం మ‌రో జాతిర‌త్నాలు సినిమాలా ఉండ‌బోతున్న‌ట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. వీజే స‌న్నికి ఇది మంచి సినిమా అవుతుంది. అంద‌రూ చేతిలో సెల్ ఫోన్, సిగ‌రెట్ ప‌ట్టుకుని తిరుగుతుంటారు జ‌య‌శంక‌ర్ మాత్ర పుస్త‌కం ప‌ట్టుకుని తిరుగుతుంటాడు. ఈ క్యాలిటీ న‌చ్చి  `పేప‌ర్ బాయ్` సినిమా డైర‌క్ష‌న్ చేసే అవ‌కాశం ఇచ్చాను.  ఈ సౌండ్ పార్టీ సినిమా అంద‌రికీ మంచి పేరు తేవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోర‌కుంటున్నా“ అన్నారు.

నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ…“ ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కిస్తోన్న ఫుల్ ఎంట‌ర్ టైన్మెంట్ చిత్రం ` సౌండ్ పార్టీ`.   దీనికి మా టీమ్ అంతా కూడా ఎంతో స‌పోర్ట్ చేసింది. ప్రేక్ష‌కులకు మా చిత్రం టీజ‌ర్ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. మా టీజ‌ర్ రిలీజ్ చేసిన సంప‌త్ నంది గారికి కృత‌జ్ఞ‌త‌లు. సెప్టెంబర్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. యంగ్ టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తూ న్యూ ఏజ్ స్టోరీస్ తో సినిమాలు చేయాల‌న్న సంక‌ల్పంతో ఫుల్ మూన్ ప్రొడ‌క్ష‌న్స్ స్థాపించాము. ఇక మీద‌ట కంటిన్యూయ‌స్ గా మా బేన‌ర్ నుండి సినిమాలు వస్తాయ‌న్నారు.

మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ…“ఈ సినిమా అవ‌కాశం రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం స‌న్నీ. అలాగే జ‌య‌శంక‌ర్ గారు, మా డైర‌క్ట‌ర్ సంజ‌య్  గారు ఎంతో స‌పోర్ట్ చేసి మంచి మ్యూజిక్  చేయ‌డానికి స‌హ‌క‌రించారు. సంత‌ప్ నంది గారు వ‌చ్చి మా టీజ‌ర్ లాంచ్ చేసి మా టీమ్ ని బ్లెస్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ…“ముందుగా మా హీరో వీజే స‌న్నికి హ్యాపీ బ‌ర్త్ డే.  ఇటీవ‌ల మా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత గారి చేతుల మీదుగా లాంచ్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ రోజు సంప‌త్ నంది గారు వ‌చ్చి మా `సౌండ్ పార్టీ` సినిమా టీజర్ లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది.  నేను  సినిమా ఇండ‌స్ట్రీలో ఈ రోజు  ఇలా ఉన్నానంటే దానికి కార‌ణం సంప‌త్ నంది గారు.  ఆయ‌నే నాకు ద‌ర్శ‌కుడుగా మొద‌టి అవ‌కాశాన్ని క‌ల్పించారు. మ‌నతో మొద‌టి నుండి ట్రావెల్ చేసేవాళ్ల‌కు, మ‌న‌కు తోడుగా ఉండేవాళ్ల‌కు మ‌నం  కూడా స‌పోర్ట్ చేయాల‌ని సంప‌త్ గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అందులో భాగంగానే ఇది నేను చేయాల్సిన సినిమా అయినా.. ప్రొడ్యూస‌ర్స్ ని క‌న్విన్స్ చేసి ఈ సినిమా త‌మ్ముడు సంజ‌య్ తో చేయించాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది.  సంజ‌య్ ఒక కొత్త త‌ర‌హా కామెడీ ఈ సినిమా ద్వారా ఇంట‌ర్ డ్యూస్ చేస్తున్నాడు. సంజ‌య్ కి చిన్న‌ప్ప‌టి నుంచి కామెడీ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాను ఆద‌రిస్తే ఒక జంధ్యాల‌, ఈవీవీ గారి త‌ర‌హా చిత్రాలు సంజ‌య్ నుంచి చాలా వ‌స్తాయి.  సినిమాను ఇంత ఫాస్ట్ గా పూర్తి చేయ‌గ‌లిగాము అంటే మా టీమ్ స‌పోర్ట్ ప్ర‌ధాన కార‌ణం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ…“ మా టీజ‌ర్ లాంచ్ చేయ‌డానికి వ‌చ్చిన సంప‌త్ నంది గారికి కృత‌జ్ఞ‌త‌లు.  మ‌నం బాహుబ‌లి లాంటి క‌థ రాసుకున్నా మ‌న వెన‌కాల ఒక బ‌లం ఉండాలి. అలాంటి బ‌ల‌మే జ‌య‌శంక‌ర్ అన్న‌.  ఆయ‌న వ‌ల్లే ఈ సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది.  ఇక సౌండ్ పార్టీ మ‌రో జాతిర‌త్నాలు రేంజ్ లో ఉండ‌బోతుంది.  ముఖ్యంగా సినిమాలో స‌న్నీ, శివ‌న్నారాయ‌ణ గారి పాత్ర‌లు విప‌రీతంగా న‌వ్విస్తాయి. 28 రోజుల్లో సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాము అంటే  మా టీమ్ స‌పోర్ట్ వ‌ల్లే“ అన్నారు.

న‌టుడు శివ‌న్నారాయ‌ణ మాట్లాడుతూ…“ సంజ‌య్ న‌న్ను ఊహించుకుని 2016లోనే ఈ క‌థ రాసుకోవ‌డం చాలా సంతోషం. అలాగే సంజ‌య్ ని ఎంక‌రేజ్ చేస్తున్న జ‌యశంక‌ర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఇద్ద‌రూ బాపూ-ర‌మ‌ణ ల్లా మంచి మిత్రులు. ప్ర‌తిది ఇద్ద‌రూ డిస్క‌ష్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జ‌య‌శంక‌ర్ గారు ఈ సినిమాకు  బ్యాక్ బోన్ . నిర్మాత‌కు మాట ఇచ్చిన ప్ర‌కారం అనుకున్న విధంగా సినిమా పూర్తి చేశారు. స‌న్నితో సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. మా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు.  ఇంత మంచి సినిమాలో నేను కూడా పార్ట్ కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

సింగ‌ర్  శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ….“అంద‌రితో క‌లిసి పోయే వ్య‌క్తిత్వం స‌న్నిది.  త‌ను మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. సౌండ్ పార్టీ పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

హీరో వీజే స‌న్ని మాట్లాడుతూ…“చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాము. జ‌య‌శంక‌ర్  స‌పోర్ట్ తో సంజ‌య్ సినిమా చాలా బాగా చేశాడు. శివ‌న్నారాయ‌ణ గారు నేను తండ్రికొడుకులుగా న‌టించాం. సినిమా అంతా ఇద్ద‌రం ఫుల్ గా నవ్విస్తాం.  మోహిత్ అద్భ‌తుమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రూ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా  చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  భువన్ సాలూరు మాట్లాడుతూ…“ఈ సినిమా అనుకున్న‌విధంగా రావ‌డానికి స‌హ‌క‌రించిన మా టెక్నీషియ‌న్స్ కి, స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సినిమా  ఫుల్ ఎంట‌ర్ టైమ‌న్ మెంట్ తో ఉంటుంది. నేను కూడా ఇందులో చిన్న పాత్ర చేశాను“ అన్నారు.

శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి

 

 

 

 

Full Moon Media Productions unveils a super-entertaining teaser of ‘Sound Party’

‘Sound Party’ Teaser gets praises from Director Sampath Nandi

Bigg Boss Telugu 5 title winner VJ Sunny’s upcoming movie titled ‘Sound Party’ is up for theatrical release. Starring Hritika Srinivas as the heroine, the film is Full Moon Media Productions’ maiden venture. Sanjay Sheri, a talented writer, is making his debut as a director. Producers Ravi Polishetty, Mahendra Gajendra, and Sri Shyam Gajendra have joined hands with presenter Jaya Shankar. The film’s teaser launch event was held today at Prasad Labs in the presence of director Sampath Nandi.

Speaking on the occasion, Sampath Nandi said, “I have been a presenter of some films. Like me, Jaya Shankar is acting as the presenter of this film. I want this practice to be continued. The teaser of ‘Sound Party’ is so good. Also, the music by Mohit is so awesome. If you look at the teaser, you will understand that this movie is going to be another ‘Jathi Ratnalu’. Everyone walks around holding a cell phone and a cigarette. But Jayashankar walks around holding a book. I liked this quality of his. That’s why I asked him to direct ‘Paper Boy’. I hope ‘Sound Party’ becomes a resounding hit.”

Producer Ravi Polishetty said, “‘Sound Party’ is a full entertainer coming under the banner of Full Moon Media Productions. Our whole team is confident that the audience will like the teaser. I thank Sampath Nandi for releasing our teaser. We are planning for a grand release of the film in September. Full Moon Productions is determined to encourage young talent and make films with new-age stories. From now on, films will come from our banner non-stop.”

Music director Mohit Rahmaniac said, “Sunny is the main reason this film has come my way. Also, Jayashankar and our director Sanjay supported us a lot and helped me in belting out good music. I am very happy that Sampath Nandi is here to bless us.”

Presenter Jaya Shankar said, “Recently, we launched the poster of our film at the hands of MLC Kalvakuntla Kavitha garu. It has got a solid response. Also, I am very happy that Sampath Nandi came here today. I am what I am today in the film industry because of Sampath Nandi. He was the one who gave me my first opportunity to direct a movie. Sampath always used to say that we should also support those who travel with us from the beginning. The movie has shaped up very well. Sanjay is introducing a new kind of comedy through this movie. If this movie is appreciated, there will be many films that will be made in the fashion of the movies of Jandhyala garu and EVV Satyanarayana garu. Our team’s support is the main reason why we were able to complete the film so fast.”

Director Sanjay Sheri said, “Thanks to Sampath Nandi for being here. Even if are equipped with a ‘Baahubali’-type story, there must be a force behind us. Jaya Shankar Anna is a source of strength. It is because of him that this film has reached this point. And ‘Sound Party’ is going to be another ‘Jathi Ratnalu’ range hit. Especially, the characters played by Sunny and Shivannarayana are hilarious. We were able to complete the film in 28 working days because of our team’s support.”

Actor Sivannarayana said, “I am very happy that Sanjay imagined me and wrote this story years ago. Also, I thank Jaya Shankar who is supporting Sanjay. Jayashankar is the backbone of this movie. As promised to the producer, the film was completed in time. The producers didn’t compromise anywhere.”

Singer Sriram Chandra said, “Sunny has a personality that connects with everyone. He is making good films and moving forward. I want Sound Party to be a big hit.”

Hero VJ Sunny said, “We made this film enjoying a great deal. Sanjay has shaped a solid movie with Jayashankar’s support. Shivannarayana and I acted as a father and a son. It was a thorough experience. Mohit gave amazing music. I want everyone to watch this film with their families.”

Executive producer Bhuvan Saluru said, “Thanks to our technicians who helped to make this movie as planned and to all the actors who supported it, we are coming out with a thorough entertainer.”

Cast:

VJ Sunny, Sivannarayana, Ali, Saptagiri, ’30 Years’ Prudhviraj, ‘Mirchi’ Priya, Manik Reddy, Ashok Kumar, Kadambari Kiran, ‘Gemini’ Suresh, Bhuvan Saluri, ‘I Dream’ Anjali, Prem Sagar, RJ Hemanth, Shashank Mouli, Trinadh, Krishna Teja and others.

Crew:

Director of Photography: Srinivas Reddy; Editor: G Avinash; Music Director: Mohit Rahmaniac; PRO: GK Media; Line Producer: Sivakanth Vanga; Executive Producer: Bhuvan Saluru; Producer: Ravi Polishetty; Presented by: V Jayashankar; Written and Directed by Sanjay Sheri.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies