September 9, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

జనవరి 8న విడుదలవుతున్న వలస

1 min read


కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవించారు. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ లక్షలాది మంది వలస కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు.వారి జీవితాలలో జరిగిన సంఘటనలే ఇతివృత్తము గా కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో మనోజ్ నందం, వినయ్ మహాదేవ్, తేజు అనుపోజు, గౌరీ లు ప్రధాన జంటలుగా, ఎఫ్ ఎం బాబాయ్, తులసి, సన్నీ, మనీష, తనూష, సముద్రం వెంకటేశ్, వాసు, నల్ల శీను, మల్లికా, చిన్నారి, ప్రవీర్ నటీ నటులుగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్,స్క్రీన్ షాట్ ఇన్ఫోటైన్మెంట్ సంయుక్తంగా యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న “వలస” చిత్రం ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా…

చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. మా “వలస” చిత్రం జనవరి 8 న విడుదల అవుతుంది.ఇలాంటి మూవీ చేయడానికి కారణం నా ఫ్రెండ్ రవి.ఇది ఒక రీస్కీ సబ్జెక్ట్. సినిమా మొత్తం విశాఖపట్నంలో చిత్రీకరణ జరుపుకుంది.వలస అనేది ఈ కరోనా వల్ల అందరం ఎఫెక్ట్ అయ్యాం.ఎం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం తో పాటు వలస కూలీలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు.ఇలాంటి ఇష్యూ 1947 లో బార్డర్ క్రాస్ చేస్తూ లక్షలాది మంది వెళ్లడం మనం ఫోటోలలోనో, పేపర్ లలో చూసాం తప్ప, ప్రస్తుతం ఇంత టెక్నోలజి పెరిగిన ఈ సమయంలో సాఫ్ట్ వేర్ వారు కావచ్చు,కూలీ వాళ్ళు కావచ్చు ఇలా చాలామంది వారి స్వస్థలాలకు వెళ్లడం ఇప్పుడు మనం లైవ్ లో చూసాం.ఎంతోమంది వలస వెళ్లే వారికి మానవతా వాదంతో ఆహారం అందించడంతో పాటు వారికి చాలా సహాయ సహకారాలు చేయడం జరిగింది.మనందరం వలసలో పాత్రదారులమే అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్.ఇంత మందికి సంబంధించిన లైవ్ స్టోరీని విజువల్ గా డాక్యుమెంట్ చేయడం మనందరి బాధ్యతగా భావించి, వీటన్నిటినీ ఒక దృశ్య రూపంలో ఇవ్వాలని, వలస జీవుల జీవిత వెతలనే కాకుండా వారి జీవితంలోని అన్ని పర్శ్వాలు సృషించడం తమ ఉద్దేశమని కష్టకాలంలో కూడా వారి మధ్య వెల్లివిరిసిన అనుబంధాలు, నిజ జీవిత హాస్యం, వారి మనోభావాలు ప్రతిఫలించే అంశాలు ఇందులో పొందుపరిచాము,ఈ సినిమాలో ఓన్లీ కష్టాలు,కన్నీళ్లే కాకుండా నవరసాలు నిండిన ఒక జీవికను ప్రేక్షకులకు పరిచయం చేయాలని, ఈ సినిమాను కేవలం వినోదం తో పాటు ఒక సామాజిక బాధ్యతగా భావించేయాలన్నదే మా కోరిక.మేము కట్టిన నగరాలు,మేము వేసిన రోడ్లపై మమ్మల్నే నడవ నీయకుండా వెలివేశారు మా అవసరం తీరిపోయిన తరువాత మమ్మల్ని వదిలేసారు అన్న ఫీలింగ్స్ ని వాళ్ళు ఎక్స్ ప్రెస్ చేయడం నేను గమనించాను అలా కాకుండా మీతో పాటు మేమున్నాం అనే ఫీలింగ్ ను తీసుకు రావడం కోసం వారి కథను వెండితెర కు తీసుకురావాలనే ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ ఉంటేనే ఇలాంటి చిత్రాలు తీయగలుగుతాం.కేవలం ఇండియన్ ఆడియన్స్ కే కాకుండా ప్రపంచ ఆడియన్స్ వరకు తీసుకెళ్లే సబ్జెక్ట్ కాబట్టి ఓ.టి.టి. మాద్యం వలన ప్రపంచ సినిమా మన చేతుల్లోకి వచ్చింది.అలా మా వలస మూవీ కూడా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వెళ్లే ఆస్కారం ఏర్పడింది.కాబట్టి దీన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా,మరియు థియేటర్ లలో విడుదల చేస్తున్నాము.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ సినిమాను పంపించాలని అనుకుంటున్నాము.
నరేష్ కుమార్ మడికి ఈ చిత్రం కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో బాటు ఎడిటర్ గా కూడా తన సేవలు అందించారని అన్నారు.

నిర్మాత యక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ ..మేము గత 20 సంవత్సరాలుగా న్యాచురాలిటికి దగ్గరగా ఉన్న చిత్రాలనే నిర్మించడం జరిగింది.సునీల్ ప్రతి సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి సినిమా చేస్తుంటాడు.వలస అనేది ఎవరూ ఊహించకుండా వచ్చిన కరోనా కోవిడ్ స్విచ్ వేషన్.చాలామంది చాలా విధాలుగా బాధ పడ్డారు.దేశాలతో సంబంధం లేకుండా భార్య ఒక చోట,భర్త ఒక చోట ఇలా చిన్న,పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలలో ఇబ్బంది పడ్డారు. అవన్నీ మనం తీసుకోకుండా ఒక రోజు జర్నీ(నడక) ని తీసుకొని ఈ చిత్రం నిర్మించడం జరిగింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రవీణ్ ఇమ్మడి సంగీతంతో వచ్చిన వలస పాటకి మంచి ఆదరణ ఉందని అలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని,దాదాపు కోటి మందికి పైగా వలస కార్మికులు తమ తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి చేసిన సాహస యాత్ర ఈ “వలస” సినిమా.లాక్ డౌన్ సమయంలో కూడా ఎంతో రిస్క్ చేసి తమ చిత్రాన్ని తెరకెక్కించాము. ప్రేక్షకులకు ఇది వారితో పాటు కలిసి ప్రయాణం చేసిన అనుభూతి ఇస్తుందని రాబోయే తరాలకు ఇది ఒక మంచి విజువల్ డాక్యుమెంట్ గా ఉంటుందని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి దీనికి సంబంధించి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించడానికి ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ :-శ్రావ్య ఫిలిం సంస్థ ఇదివరకు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన “సొంత ఊరు” “గంగపుత్రులు” గల్ఫ్ తరహాలోనే ఇది ఒక మంచి చిత్రమవుతుంది. ప్రస్తుతం 50 శాతం మాత్రమే సీటింగ్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ లు సహాయ,సహకారాలతో 90 స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము , ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా, ఓవర్సీస్ లోను, తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలోనూ విడుదల చేస్తున్నామని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని తాము భావిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies