September 25, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ విడుదల చేసిన డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు టీజ‌ర్

1 min read

`118` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌`డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. మ‌క‌ర సంక్రాంతి పండ‌గ‌ సంద‌ర్భంగా `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` మూవీ టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మాట్లాడుతూ – “నాకు ఇష్ట‌మైన టెక్నీషియ‌న్స్‌లో కేవి గుహ‌న్ గారు ఒక‌రు. ఆయ‌న‌తో చాలా మంచి సినిమాల‌కు వ‌ర్క్‌ చేశాను. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు`టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. టీజ‌ర్ చూశాను చాలా బాగుంది సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్‌“ అన్నారు.

ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ – “టెక్నీషియ‌న్స్‌కి ఎంతో గౌర‌వం ఇచ్చే మంచి వ్య‌క్తి మ‌హేష్‌బాబు గారు. మ‌హేష్‌గారితో `అత‌డు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `దూకుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌కి వ‌ర్క్ చేశాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. అలానే నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి చిత్రం `118` చూసి న‌న్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. నా మీద అభిమానంతో `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఈ చిత్రం విజ‌యానికి శుభ‌సూచ‌కం“ అన్నారు.

చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు దాట్ల మాట్లాడుతూ – “ మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడబ్ల్యు`. మా మొద‌టి సినిమా టీజ‌ర్‌ మ‌హేష్ బాబు గారి లాంటి సూప‌ర్‌స్టార్ లాంచ్ చేయ‌డం ఆనందంగా, గ‌ర్వంగా ఉంది. మ‌హేష్ బాబు గారి గోల్డెన్ హ్యాండ్‌తో రిలీజైన మా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. గుహ‌న్ గారు ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

హీరో అథిత్ అరుణ్ మాట్లాడుతూ – “ఎంతో మందికి ఇన్స్‌పిరేష‌న్ అయిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గారు మా `డ‌బ్ల్యుడ‌బ్ల్యుడ‌బ్ల్యు` టీజ‌ర్ లాంచ్ చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. గుహ‌న్ గారు ఈ సినిమా ఎంతో థ్రిల్లింగ్‌గా తీశారు“ అన్నారు.

హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “నాన్న గారికి మ‌హేష్‌బాబు గారికి మంచి అనుభందం ఉంది. మా అంద‌రికీ మ‌హేష్‌బాబు అంటే చాలా ఇష్టం. నా తొలిచిత్రం టీజ‌ర్ మ‌హేష్‌బాబు గారు లాంచ్ చేయ‌డం చాలా థ్రిల్‌గా ఉంది“ అన్నారు.

కో – ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ధ‌ర‌న్ దాట్ల మాట్లాడుతూ – “ఎంతో బిజీగా ఉండి కూడా గుహ‌న్ గారి మీద అభిమానంతో టీజ‌ర్‌ని రిలీజ్‌చేసి మా సంస్థ‌ని ఎంత‌గానో ప్రోత్సహిస్తున్న మహేష్‌బాబుగారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. ప్ర‌‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్, ప్రియ‌ద‌ర్శి, వైవా హ‌ర్ష త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్,
సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌: నిఖిల్ హ‌స‌న్‌,
డైలాగ్స్‌: మిర్చి కిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌ శ్రీ‌రామ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్,
స్టంట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: పొన్మ‌ని గుహ‌న్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. రవి కుమార్‌,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దాట్ల,
క‌థ‌, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కె వి గుహ‌న్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *