October 1, 2022

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

అలాంటి హీరోయిన్ కావాలంటున్న బన్నీ ?

స్టైలిష్ స్టార్ నటిస్తున్న ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పలు దఫాల్లో షూటింగ్ జరుపుకుంటూ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇటీవల సుకుమార్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టాడు. పుష్ప లో హీరోయిన్‌గా తెలుగు బ్యూటీనే తీసుకోవాలని బన్నీ పట్టుపట్టాడని సుకుమార్ తెలిపాడు. బన్నీ లాంటి స్టార్ హీరో కూడా తెలుగు అమ్మాయికే ఓటు వేశాడంటే ఇది ఖచ్చితంగా విశేషమనే చెప్పాలి. తెలుగు మాట్లాడే హీరోయిన్ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఆయన భావించాడట. అందుకే తెలుగమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని చూశాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడం, దీంతో కన్నడ బ్యూటీ రష్మిక మందనను హీరోయిన్‌గా తీసుకోవడం జరిగిందని సుకుమార్ తెలిపారు. ఏదేమైనా ఓ తెలుగు హీరోయిన్ కావాలంటూ బన్నీ పట్టుపట్టడం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, రాబోయే రోజుల్లో బన్నీ ఖచ్చితంగా ఓ తెలుగమ్మాయితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఈ వార్తతో తేలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *