October 1, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

విశాల్ చక్ర మూవీ రివ్యూ

దర్శకత్వం : ఎం ఎస్ ఆనందన్
నిర్మాత : విశాల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
కెమెరా : బాల సుబ్రహ్మణియన్
ఎడిటింగ్ : తీయగు
నటీనటులు : విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, కె ఆర్ విజయ, సృష్టి దాంగె, మనోబాల
విడుదల తేదీ : 19 – 02 – 2021
రేటింగ్ : 2. 75 / 5

హీరోగా విశాల్ భిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా బిజీగా మారాడు. కమర్షియల్ సినిమాలే కాదు జనాలకు మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తరహా సినిమాలపై ఎక్కువ ఆసక్తి చుపిస్తున్నాడు విశాల్. అభిమన్యుడు సినిమాతో ప్రజలు ఎలా డిజిటల్ మోసాలకు గురవుతున్నారో చెప్పిన విశాల్ ఈ సినిమాతో డిజిటల్ ఇండియా వల్ల జనాలకు ఎలాంటి నష్టాలూ ఉన్నాయి. అసలు డిజిటల్ ఇండియా విషయంలో ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది లాంటి పలు ఆసక్తికర విషయాలు చెప్పే ప్రయత్నం చేసారు. మరి ఈ చక్ర ఏమిటి ? దాని కథేమిటి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే !!

కథ:

ఆగష్టు 15న హైదరాబాద్ లో ఒకేసారి పలు చోట్ల 50 దొంగతనాలు జరుగుతాయి. అందులో మిలిటరీలో పని చేస్తున్న చంద్రు(విశాల్) ఇంట్లోని వాళ్ళ ఫాదర్ కి చెందిన అశోక చక్ర మెడల్ ని కూడా దొంగతనం చేస్తారు. దాంతో చంద్రు మిలిటరీ నుంచి వచ్చేసి తన ఫాదర్ మెడల్ ని దొంగిలించిన వాళ్ళ నుంచి వెతికి పట్టుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా ఆ కేసు డీల్ చేస్తున్న గాయత్రి(శ్రద్ధ శ్రీనాథ్) టీంలో జాయిన్ అవుతాడు. ఇక అక్కడి నుంచీ చంద్రు తన టాలెంట్ తో ఆ దొంగతనాల వెనకున్న మాస్టర్ మైండ్ ని ఎలా పట్టుకున్నాడు? పట్టుకునే ప్రక్రియలో ఆ దొంగ నుంచీ చంద్రు అండ్ గాయత్రి టీం ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? వాటిని ఎలా ఛేదించి దొంగని పట్టుకున్నారు? ఆ దొంగ అన్ని దొంగతనాలు ఒకేసారి చేయడానికి గల కారణం ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో హీరో విశాల్ బాగా సూట్ అవుతాడు. అతని పర్సనాలిటీ పోలీస్ పాత్రలకు సూపర్. ఇక ఈ సినిమాలో మిలటరీ అధికారిగా విశాల్ ఆకట్టుకున్నాడు. హీరోగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. నటన, యాక్షన్ విషయాల్లో విశాల్ మరింత ఎనర్జీ ప్రదర్శించాడు అని చెప్పాలి. ఇక హీరోయిన్ శ్రద్ధ శ్రీనాద్ తన పరిధి మేరకు చక్కని నటన ప్రదర్శించింది. అయితే పోలీస్ పాత్రకు ఆమె కొత్త కాబట్టి.. కొన్ని విషయాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మిగతా నటులు వారి వారి పాత్రల్లో బాగా చేసారు. ముక్యంగా సైబర్ క్రైమ్ బ్యాక్డ్రాప్ మరియు ఈ డిజిటల్ యుగంలో హ్యాకింగ్ వంటి ప్రధాన దోపిడీ మార్గాలను వెలికితీయడం, కీలకమైన ‘డయల్ యువర్ హెల్ప్’ యుటిలిటీ సర్వీస్ యాప్ ఎపిసోడ్, చెస్ గేమ్ మరియు విశాల్ వీటన్నిటిని చక్కగా చూపించారు. ఒకరకంగా ప్రజలను ఈ విషయంలో మేల్కొలిపే ప్రయత్నం చేసారని చెప్పాలి.

టెక్నీకల్ హైలెట్స్ :

ముందుగా సినిమాని నడిపించిన డైరెక్టర్ ఎంఎస్ ఆనందన్ గురించి మాట్లాడుకుంటే.. కథ పరంగా ఒక సైబర్ క్రైమ్ గురించి చెప్పాలి అనుకున్నాడు. టీజర్స్ మరియు ట్రైలర్స్ చూస్తే ఇదేదో సూపర్బ్ హాకింగ్ సినిమాలా అందరికీ రీచ్ చేశారు కానీ సినిమాలో సైబర్ క్రైమ్ అనే పాయింట్ చాలా చిన్నది అయిపోవడం, సైబర్ క్రైమ్ పాయింట్ చుట్టూ కాకుండా హీరో – విలన్ మధ్య వార్ లా సినిమాని తీసుకెళ్లడం కథలో ఇంపాక్ట్ మిస్ అయ్యేలా చేసింది. కానీ కథనంలో చాలా వరకూ మేనేజ్ చేసాడు. అందుకే సినిమాలో చాలా వరకూ టైం పాస్ అయిపోతుంది. డైరెక్టర్ గా ఆడియన్స్ ని కూర్చో బెట్టడంలో ఒక 60% సక్సెస్ అయ్యాడు. కానీ క్రైమ్ లో పెద్ద మజా లేకపోవడం, చాలా రియలిస్టిక్ పాయింట్స్ చెప్పకుండా వదిలేయడం వలన సినిమా బాగుంది బాలేదు అన్న దానికి మధ్యలో ఉండిపోతుంది.
ఇక టెక్నికల్ టీమ్ చక్ర కి బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. కెటి బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ బాగుంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫీల్ ని బాగా క్యారీ చేసాడు. ఆ విజువల్స్ కి మరితం బలం చేకూర్చింది మాత్రం యువన్ శంకర్ రాజా మ్యూజిక్. స్పెషల్ గా హీరో కి విలన్ కి స్పెషల్ గా చేసిన ట్యూన్స్ చాలా బాగున్నాయి. త్యాగి ఎడింగ్ బాగుంది. ఎక్కడా లాగ్ లేకుండా షార్ట్ అండ్ క్రిస్ప్ గా సినిమాని కట్ చేయడం ఒక ప్లస్ పాయింట్. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. విశాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరగా :

భారీ హైప్ తో వచ్చిన థ్రిల్లర్ “చక్ర” లో కొన్ని ఎలిమెంట్స్ మంచి ఎంగేజింగ్ గా ఉంటాయి, అలాగే ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమా నుంచి ఏవైతే అంశాలను కోరుకుంటారో అంటే విశాల్ మరియు విలన్ ల నడుమ మైండ్ గేమ్ తో థ్రిల్ ఫీల్ అవుతారు. కానీ ఈ ఇంటెలిజెన్స్ మేకింగ్ లో కూడా కొన్ని లోటు పాట్లు సిల్లీగా అనిపిస్తాయి. చక్ర ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద కేసును పరిష్కరించడానికి ఒక మిలటరీ అధికారి న్యూ ఢిల్లీ నుండి హైదరాబాద్కు రావడం లాజిక్ మిస్ అయినట్టు అనిపించింది. అయితే దర్శకుడు శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఒప్పించటానికి ప్రయత్నించినప్పటికీ ఆ లోటు భర్తీ కాలేదు. విశాల్ హీరోయిజం కోసం ఎక్కువ ఖర్చు చేసినట్టుంది. కొన్ని సిల్లీ థింగ్స్ తప్పిస్తే చక్ర ఓ మంచి థ్రిల్లర్ అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *