కోటేశ్వరరావు గారి కొడుకులు ప్రారంభించారు
అభినవ్, సత్య మణి హీరోలుగా నవీన్ ఇరగాని దర్శకత్వంలో మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న చిత్రం ” కోటేశ్వరరావు గారి కొడుకులు”. (మోస్ట్ డేంజరస్ వేపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది క్యాప్షన్. ఈ చిత్రం జనవరి 10న హైదరాబాద్ దసపల్లా హోటల్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హీరోలు అభినవ్, సత్య మణిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నరేష్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నరేష్, హీరో అడవి శేష్, అడిషనల్ చీఫ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆఫీసర్ యస్వీ కృష్ణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హీరోలు అభినవ్, సత్య మణి, దర్శకుడు నవీన్ ఇరగాని, డివోపి రాము కంద, సంగీత దర్శకుడు పద్మనాబ్ భరద్వాజ్, నిర్మాత తన్వీర్ యండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీనియర్ నటులు నరేష్ వికె మాట్లాడుతూ.. ‘ ‘కోటేశ్వరరావు గారి కొడుకులు’ టైటిల్ చూస్తుంటే దాసరి నారాయణరావు గారి టైటిల్ లా ఉంది. సినిమా పోస్టర్ చూస్తుంటే రాంగోపాల్ వర్మ సినిమా పోస్టర్ లా ఉంది. డబ్బు కి ప్రధానస్థానం ఉంది. ప్రదానంతో చాలా సినిమాలు వచ్చాయి. నవీన్ ఓ కొత్త పాయింట్ తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నావేల్టీ.. నెగిటివిటీతో రూపొందిస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రధమ స్థానంలో ఉంది. ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ మంచి హిట్స్ ఇస్తున్నారు. నవీన్ కూడా ఈ సినిమాని బాగా తీస్తాడాని నమ్ముతున్న.. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ కావాలని.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.
హీరో అడవి శేష్ మాట్లాడుతూ.. ‘ టైటిల్ చూడగానే చాలా ఫ్రెష్ గా.. అలాగే పోస్టర్ చూడగానే భలే క్యూరియాసిటీగా ఉంది అనిపించింది. అభినవ్, సత్య మణిలకు మంచి పేరు వచ్చి హీరోలుగా ఇంకా హైట్స్ కి వెళ్లాలని.. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని జెన్యూన్ గా కోరుకుంటూ.. టీమ్ కి బెస్ట్ విషెస్ అన్నారు.
దర్శకుడు నవీన్ ఇరగాని మాట్లాడుతూ.. ‘ ఆర్జీవి గారి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోను, రైటర్ గా వర్క్ చేశాను. ఒక ఫాథర్ అండ్ సన్స్ మధ్య డబ్బు ప్రధాన నేపథ్యంలో కథ జరుగుతుంది. మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుల మధ్య జరిగే స్టోరీ ఇది. ఒక తండ్రి తన కొడుకులను కోటీశ్వరులను చేయాలనుకుంటాడు.. చేయలేకపోతాడు.. కానీ ఆ తండ్రిని కొటేశ్వరుడుని చేయాలనుకుంటారు కొడుకులు. వారు అందుకోసం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు.. వారు తీసుకున్న డిసిషన్ రాంగా.. రైటా.. వాళ్ళు కోటీశ్వరులు అయ్యారా..!లేదా అనేది చిత్ర మెయిన్ కథాంశం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ.. ఎంకరేజ్ చేస్తున్న యస్వీ కృష్ణ గారికి చాలా థాంక్స్.. అన్నారు.
అడిషనల్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆఫీసర్ యస్వీ కృష్ణ మాట్లాడుతూ..’ షార్ట్ టైమ్ లో పిలవగానే వచ్చిన అడవి శేష్, నరేష్ లకు థాంక్స్. నవీన్ బ్యూటిఫుల్ స్క్రిప్టు తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడున్న న్యూ ట్రెండ్ లో ఓల్డ్ టైటిల్ తో నవీన్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఈ సినిమాని సరికొత్త స్క్రీన్ ప్లే తో చేయబోతున్నాడు.. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ కావాలి.. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
నిర్మాత తన్వీర్ యండి. మాట్లాడుతూ.. ‘ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపి మార్చి నెలాకరుకల్లా రెండు షెడ్యూల్ లో సినిమాని ఫినిష్ చేస్తాం. మే నెలలో సినిమాని విడుదల చేస్తాం.. అన్నారు.