వేదాంతం రాఘవయ్య మొదలెట్టాడు
సునీల్ హీరోగా నటిస్తోన్న చిత్రం `వేదాంతం రాఘవయ్య`. సి చంద్రమోహన్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట, గోపిఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల ఇదే బేనర్‌లో గద్దలకొండ గణేష్ చిత్రంతో ప్రేక్షకులని అలరించిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
`వేదాంతం రాఘవయ్య` హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ క్లాప్ కొట్టి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత గోపి ఆచంట కెమెరా స్విచాన్ చేయగా, స్క్రిప్ట్‌ను రామ్ ఆచంట దర్శకుడు సి చంద్రమోహన్‌కు అందజేశారు.
సాయి కార్తిక్ సంగీతం అందిస్తుండగా దాము నర్రవుల సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.
సునీల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి చంద్రమోహన్
కథ, సమర్పణ: హరీష్ శంకర్
బేనర్: 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
సంగీతం: సాయి కార్తిక్
సినిమాటోగ్రఫి: దాము నర్రవుల
ఆర్ట్: అవినాష్ కొల్ల,
మాటలు: ప‌్రవీణ్ వర్మ
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఫణి కందుకూరి
ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా,
లైన్ ప్రొడ్యూసర్: కె ఆర్ కె రాజు