ఉప్పెన హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచేసిందా ?
వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది కృతి శెట్టి ? ఈ అమ్మడి అందానికి, నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు.. మొదటి సినిమా సంచలన విజయం అందుకోవడంతో నెక్స్ట్ సినిమాకు రెమ్యూనరేషాన్ పెంచేసిందంటూ ప్రచారం జరుగుతుంది ?
కృతి శెట్టి.. ప్రస్తుతం ఎక్కడ చుసిన ఉప్పెన గురించే మాట్లాడుకుంటున్నారు .. ముక్యంగా అందులో నటించిన హీరోయిన్ కృతి గురించే యూత్ టాక్ ? ఈ అమ్మాయి అందం, నటన అబ్బో ఎన్ని చెప్పిన తక్కువే !! మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసుకున్న కృతి కి ఉప్పెన విడుదలకు ముందే రెండు, మూడు సినిమాల్లో ఛాన్సులు పట్టేసింది. ఉప్పెన సినిమాకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ భామ నెక్స్ట్ సినిమాల కోసం రెండంకెల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం !! ప్రస్తుతం నాని శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాలకు భారీగానే తీసుకుందట ? ఈమె రెమ్యూనరేషన్ పెంచినా కూడా నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అయ్యారట!!