ఈ నెల 26న సూపర్ స్టార్ కీలక ప్రకటన

ఆరోగ్య కారణాలరీత్యా తాను రాజకీయాల్లోకి రాలేనంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేసినా కూడా తమిళ రాజకీయాలు మాత్రం ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. రజనీ ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఆయన అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 26న రజనీకాంత్ 40వ వివాహ వార్షికోత్సవ వేడుక జరగనున్న నేపథ్యంలో అయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి రజనీ గతేడాది డిసెంబర్ 31న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని పేర్కొన్నారు. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే, అనూహ్యంగా హైదరాబాద్ లో సినిమా షూటింగ్ సందర్బంగా అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుని చెన్నై వెళ్లిపోయిన తర్వాత తాను రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించారు. పార్టీ పెట్టకుండానే వెనక్కి వెళ్లినట్టయింది పరిస్థితి .. అయినా సరే అభిమానులు మాత్రం రజనీ పార్టీ పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదే సమయంలో మరో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సైతం రజనీ మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రజనీ నివాసానికి వెళ్లి 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. సో కమల్ రజని ని సపోర్ట్ అడిగినట్టు తెలుస్తోంది ? మరి ఈ ఆసక్తికర అంశాల మధ్య రజని ఆ రోజు ఏమి చెబుతాడో అన్నది టెన్షన్ గా మారింది ?