June 4, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

బాలీవుడ్ లో ఉప్పెన క్రేజ్ ?

మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికి తెలుసు. ఇప్పటికే వందకోట్ల రికార్డ్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమాను హిందీ మరియు తమిళంలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా హాట్ న్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే హిందీ రీమేక్ రైట్స్ గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ను రీమేక్ చేసేందుకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ మొత్తంను పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట.
మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు షాకిచ్చేలా ఈ హక్కులకు భారీ రేట్ దక్కినట్టు తెలుస్తోంది ? ఈ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న నిర్మాణ సంస్థ ఇషాన్ కట్టార్ మరియు అనన్య పాండే జోడీగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం ? ఇక తమిళంలో సూపర్ స్టార్ విజయ్ తనయుడు జాన్సన్ తో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *