February 29, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

NTR Launches Timmarusu Movie Trailer

1 min read
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించిన సత్యదేవ్ ‘తిమ్మరుసు’ ట్రైలర్*
స‌త్య‌దేవ్‌… ప్ర‌తి సినిమా ఓ డిఫ‌రెంట్‌గా చేస్తూ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న క‌థానాయ‌కుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగి పోయే నేటి త‌రం అతి కొద్ది మంది న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌రు. బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌లో మోసాలు చేసేవాడిగా, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య‌లో విలేజ్ కుర్రాడిగా మెప్పించిన స‌త్య‌దేవ్ ఇప్పుడు అన్యాయాల‌ను ప్ర‌శ్నించే లాయ‌ర్ ‘తిమ్మరుసు’గా కనిపించబోతున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
‘త‌ను తెలివైన‌వాడే కానీ.. ప్రాక్టిక‌ల్ ప‌ర్స‌న్ కాదు..ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుండి కారుకి వెళతారు.. రామ్ కారు నుండి బైక్‌కి వచ్చాడు.. త‌న‌కేమో హ‌గ్ నాకేమో షేక్ హ్యాండా…‘గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి’ ఇలాంటి డైలాగ్స్‌తో హీరో స‌త్య‌దేవ్‌, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మ‌ధ్య ల‌వ్, స‌త్య‌దేవ్‌-బ్ర‌హ్మాజీ మ‌ధ్య ఉండే రిలేష‌న్ గురించి తెలియ‌జేస్తుంటే…
‘ఎనిమ‌దేళ్ల క్రితం జ‌రిగిన క్యాబ్ డ్రైవ‌ర్ కేస్ కాంపెన్‌సేష‌న్ కేస్‌…’
స‌త్య‌దేవ్ ఓ అబ్బాయితో ‘అంత చిన్న వ‌య‌సులో అంత పెద్ద మ‌ర్డ‌ర్ ఎలా చేశావ్‌? ’ అని అడ‌గ‌టం ‘మాట‌లతో చెబితే అర్థం కావ‌ట్లేదా మీకు అని అబ్బాయి స‌త్యదేవ్‌పై అర‌వ‌డం.. అబ్బాయి త‌ల్లి పాత్ర‌లో చేసిన ఝాన్సీ అబ్బాయిని ఆప‌టం..
‘ఇప్పుడేం చేద్దామంటావు అని ఓ పెద్ద‌మ‌నిషి అడిగిన‌ప్పుడు కేసు రీ ఓపెన్ చేద్దాం అని స‌త్య‌దేవ్ అన‌టం’  … ఇలాంటి డైలాగ్స్‌తో  సినిమాలో అస‌లు పాయింట్ ఏంట‌నేది?  అర్థ‌మ‌వుతూనే సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తిని క‌లిగిస్తుంది.
‘ఎనిమ‌దేళ్ల క్రితం జ‌రిగిన కేసుని ఓపెన్ చేయొచ్చు.. కానీ ఏడాది క్రితం జ‌రిగిన కేసుని ఓపెన్ చేయ‌కూడ‌దా …’ అని పోలీస్ ఆఫీస‌ర్ అయిన అజ‌య్, స‌త్య‌దేవ్‌ని ప్ర‌శ్నించ‌టం,
‘కోర్ట్‌కు కావాల్సింది షార్ట్ ఫిల్మ్స్, మాక్ డ్రిల్స్ కాదు.. బలమైన ఆధారాలు’
‘నాకెందుకో మీకు జ‌రిగిన యాక్సిడెంట్‌పై అనుమానంగా ఉంది’  అనేటువంటి డైలాగ్స్‌తో సినిమాలో ఇన్‌టెన్స్ ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతుంది.
‘నేను కొడితే సౌండెలా వ‌స్తుందో వాడ్న‌డుగు’అని స‌త్య‌దేవ్‌ని అజ‌య్ బెదిరించ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. ‘నువ్వు కొడితే సౌండ్ వస్తుందేమో.. ఈ లాయర్ కొడితే.. లైఫంతా రీ సౌండే’ అంటూ స‌త్య‌దేవ్ రిటార్డ్ ఇవ్వ‌డం
‘నువ్వు సగం బలం లాక్కునే వాలివయితే.. నేను దండ వేసి దండించే రాముడిలాంటివాడిని’.. వంటి డైలాగ్స్, కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు హీరో క్యారెక్ట‌ర్‌లోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి… ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.
ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన  నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.
నటీనటులు:
సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌
ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె
యాక్షన్‌:  రియల్‌ సతీశ్‌
పి.ఆర్‌.ఒ: వంశీకాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *