April 21, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Ishq Movie Must Success -Dil Raju

1 min read

ఈనెల 30న విడుద‌ల‌వుతున్న ఇష్క్ సినిమాని త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను – ప్ర‌ముఖ‌నిర్మాత దిల్‌రాజు.

యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం `ఇష్క్‌`. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి  ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో..

వాకాడ అప్పారావు మాట్లాడుతూ – “ఈ క‌రోనా క‌ష్ట‌కాలాన్ని అధిగ‌మించి ఈ నెల 30న థియేట‌ర్స్ ఓపెన్ చేస్తున్నారు.  అందులో భాగంగా `ఇష్క్ సినిమా రిలీజ్ అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. దిల్‌రాజుగారితో మాకు ఎప్ప‌టినుండో మంచి అభిన‌వ‌భావసంభందాలు ఉన్నాయి. ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం ఆనందంగా ఉంది. చిన్న ఇన్స్‌డెంట్‌ని ఆధారం చేసుకుని తీసిన స‌బ్జెక్ట్ ఇది. ఇలాంటి స‌బ్జెక్ట్స్‌తో సినిమా తీయ‌డానికి చాలా గ‌ట్స్ కావాలి. హీరోహీరోయిన్లు చ‌క్క‌గా న‌టించారు.టెక్నీషియ‌న్స్ మంచి స‌పోర్ట్ అందించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాను పాత్రికేయులు బాగా ప్ర‌మోట్ చేయాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ – “మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన దిల్‌రాజు గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. రాజుగారి బ్యాన‌ర్‌లో ఆరేడు సంవ‌త్స‌రాల‌నుండి వ‌ర్క్ చేస్తున్నాను. ఆయ‌న ద‌గ్గ‌రినుండి చాలా విష‌యాలు నేర్చుకోవ‌డం జ‌రిగింది. ఈ రోజు నేను ఆ స్టేజ్‌మీద ఉండ‌డానికి చేయూత‌నిచ్చింది దిల్‌రాజుగారే.. క‌రోనా త‌ర్వాత థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌డం అందులో ఒక తెలుగు సినిమా విడుద‌ల‌వుతుండ‌డం చాలా సంతోషం. మ‌నం అంద‌రం తెలుగు సినిమాల‌ని ఆద‌రించి మ‌ళ్లీ తెలుగుసినిమాకి పున‌ర్వైభ‌వం తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను. ఇష్క్‌ ఒక కొత్త క‌థ‌. సినిమా చూసిన వాళ్లు త‌ప్ప‌కుండా థ్రిల్ ఫీలవుతారు“ అన్నారు.

హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మాట్లాడుతూ – “ఇది తెలుగులో నా సెకండ్ ప్రాజెక్ట్‌. క‌రోనా త‌ర్వాత న‌న్ను నేను మ‌రోసారి బిగ్‌స్క్రీన్ మీద చూసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ దిల్‌రాజుగారు ఫ‌ర్ గ్రేసింగ్ ద ఈవెంట్‌. నా మీద న‌మ్మ‌కంతో ఈ అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు. ఎస్ ఎస్ రాజుగారు ఫంటాస్టిక్ డైరెక్ట‌ర్. షూటింగ్ స‌మ‌యంలో చాలా హెల్ప్ చేశారు. థియేట‌ర్స్‌లో మా ఇష్క్ సినిమాను చూసి స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

హీరో తేజ స‌జ్జ మాట్లాడుతూ – “జులై30న థియేట‌ర్స్‌లో మా `ఇష్క్`సినిమా విడుద‌ల‌వుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్ సినిమా కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెంట్ తో వస్తోంది. ఎడ్జ్ఆఫ్ ది సీట్ థ్రిల్ల‌ర్ సబ్జెక్ట్‌. ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ వ‌ర‌కు నెక్ట్స్ ఏం జ‌రుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తెలుగులో ఇలాంటి స‌బ్జెక్ట్ ఇంత‌వ‌ర‌కూ రాలేదు అనుకుంటున్నాను. సాగ‌ర్ మ‌హ‌తి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా న‌చ్చితే న‌లుగురికి చెప్పండి ఇలాంటి కొత్త‌ర‌కం సినిమాల‌ను ఎంక‌రేజ్ చేసిన వాళ్లుఅవుతారు. సినిమా రెడీ అయ్యాక కూడా థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేద్దాం అని ఇన్ని రోజులు హోల్డ్ చేసిన మా నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌. నా ఫ‌స్ట్ సినిమాకి దిల్‌రాజుగారే మాట్లాడి నాకు అవ‌కాశం ఇప్పించారు. ఇప్పుడు థియేట‌ర్స్‌ని స‌పోర్ట్ చేయ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చారు. మంచి సినిమాల‌కు దిల్‌రాజుగారి స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ –  “గ‌తేడాది నుండి కరోనా ప్ర‌భావం అన్నిఇండ‌స్ట్రీల‌మీద ప‌డింది. ఫిలిం ఇండ‌స్ట్రీమీద ఇంకా ఎక్కువ ప‌డింది. మూడు నెల‌ల త‌ర్వాత ఈ నెల 30న విడుద‌ల‌య్యే రెండు సినిమాలు స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ పాండ‌మిక్‌ని గుర్తుపెట్టుకుని ప్రేక్ష‌కులు కూడా త‌ప్ప‌కుండా మాస్కులు వేసుకునే సినిమా చూడాలని కోరుకుంటున్నాను. నా బిగినింగ్ డేస్ లో డిస్ట్రిబ్యూట‌ర్‌గా నేను నిల‌బ‌డ‌డానికి సూప‌ర్ గుడ్ ఫిలింస్ ఎన్వీ ప్ర‌సాద్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌, పార‌స్ జైన్ గారు చేసిన హెల్ప్ మ‌రియు వాళ్లు  ప్రోత్సహించిన విధానం కాని, నేను డిస్ట్రిబ్యూట‌ర్‌గా స‌క్సెస్ అయిన త‌ర్వాత ఆర్‌.బి. చౌధ‌రి గారు త‌మిళంనుండి చాలా  సినిమాలు చేసేవారు. వారికి 90% స‌క్సెస్ రేట్ ఉండేది కాబ‌ట్టి వారు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అని చాలా స్ట‌డీ చేసేవాన్ని. రామానాయుడుగారు, ఆర్ బి చౌధ‌రిగారు ఇలా ఎవ‌రెవ‌రు క‌థ‌ల మీద మంచి గ్రిప్ ఉన్న ప్రొడ్యూస‌ర్స్ అని స్ట‌డీ చేసే నా ప్ర‌తి సినిమాకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాను.  అలాంటి సూప‌ర్ గుడ్ ఫిలింస్‌లో వ‌స్తోన్న ఇష్క్ సినిమా ఈ నెల 30న విడుద‌ల‌వుతుంది. మంచి కాంటెంట్ కాబ‌ట్టి రిజ‌ల్ట్ కూడా బాగా వ‌స్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను. నాగ‌రాజు నాతో శ‌త‌మానం భ‌వ‌తి, ఎంసిఎ సినిమాల‌కు వ‌ర్క్ చేశారు. మంచి సెన్సిబిలిటీ ఉన్న ప‌ర్స‌న్‌. చాలా మంచి సినిమాల‌కు వ‌ర్క్ చేశారు. ఆ ఎక్స్‌పీరియ‌ర్స్ త‌న మొద‌టి సినిమాకు త‌ప్ప‌కుండా ఉప‌యోగ‌ప‌డుతుంది. తేజ‌, ప్రియా న్యూ జెన‌రేష‌న్‌. తేజ చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ఓ బేబి, జాంబీరెడ్డి సినిమాల‌లో చాలా మెచ్యూర్డ్‌గా పెర్‌ఫామ్ చేస్తున్నాడు. ప్రియా రాత్రికి రాత్రే వ‌రల్డ్ మొత్తాన్ని సోష‌ల్‌మీడియాలో షేక్ చేసింది. వీరిద్ద‌రికీ ఆల్ ది బెస్ట్‌. మంచి సినిమా కాబట్టి త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

తారాగ‌ణం:
తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్, తమిళ నటుడు రవీందర్‌

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
బ్యాన‌ర్‌:  మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ:  శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  విఠ‌ల్ కొస‌నం
లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies