పవర్ స్టార్ తో రానా సినిమా కన్ఫర్మ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ మాములుగా లేదు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న అయన ఆ సినిమా తరువాత ఏకంగా మరో నాలుగు సినిమాలు క్యూ లో పెట్టేసారు. అది కాకుండా తాజాగా టాలీవుడ్ హీరో రానా తో కలిసి మరో సినిమాకు ఓకే చెప్పాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ ను రీమేక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సోమవారం లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. మొదటి నుండి .. ఈ సినిమాలో పవన్ తోపాటు రెండో హీరోకు అవకాశం ఉండడంతో.. ఆ పాత్రను ఎవరు పోషిస్తారా..? అనే సస్పెన్స్ కొంత కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో.. నితిన్ రానా సాయిధరమ్ తేజ్ రవితేజ గోపీ చంద్ కిచ్చా సుదీప్ అంటూ.. చాలా పేర్లు వినిపించాయి. అయితే.. చివరకు రానా ఫైనల్ అయ్యాడు. ఇక చిత్రాన్ని మాత్రం వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయనున్నట్ల సమాచారం.
సీతార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నారు. ఈ దర్శకుడు గతంలో అయ్యారే అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలను రూపొందించారు.