సలార్ గ్రాండ్ గా మొదలెట్టాడు
రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా స్టార్, హీరో అంటే ఇలాగే ఉండాలనే కటౌట్, తిరుగులేని ఫాలోయింగ్.. ప్రశాంత్ నీల్.. రెండో సినిమాకే ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్. హీరోలను సరికొత్తగా అంచనాలకు ధీటుగా మాస్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేసే దర్శకుడు. ఇలాంటి ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్స్ కాంబినేషన్‌లో సినిమా రూపొందితే చూడాలని ఫ్యాన్సే కాదు.. ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. అయితే ఈ కోరికను తీర్చేలా భారీ బడ్జెట్ మూవీని చేయగలిగే నిర్మాత ఎవరా అనే ప్రశ్నకి సమాధానం.. సౌత్ ఇండియా సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తూ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగందూర్. ఇలాంటి క్రేజీ కలయికలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’.
ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సలార్’ శుక్రవారం లాంఛనంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ఓ వేడుకలా ప్రారంభమైంది. ఈ వేడుకకు కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, కన్నడ రాకింగ్ స్టార్ యష్, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ డి.వి.వి.దానయ్య, నవీన్ ఎర్నేని, సాయికొర్రపాటి తదితరులు హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా…
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ – “నాకు అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్‌గారికి, హీరో ప్రభాస్‌గారికి ధన్యవాదాలు. అలాగే నా ప్రియమైన రాకింగ్ స్టార్ యష్ ఈరోజు మాతో ఉండటం మరింత ఆనందాన్ని ఇచ్చింది. మీ ప్రేమ, ఆశీర్వాదాలు అందిస్తున్న అందరికీ థాంక్స్. ‘సలార్’ మిమ్మల్ని నిరాశపరచదు” అన్నారు.
‘సలార్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ధన్యవాదాలు తెలిపారు.