నాకు నెగిటివ్ వచ్చేసిందన్న రామ్ చరణ్ ?
మొత్తానికి మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు హీరో రామ్ చరణ్. ఎందుకంటే ఆయనకు ఈ మద్యే కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా టెస్టులో నెగెటివ్ అని తేలిందని వెల్లడించాడు చరణ్. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. ‘నాకు కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా. త్వరలోనే మళ్లీ షూటింగుల్లో పాల్గొంటాను. మీ అందరి విషెస్ కు థ్యాంక్స్’ అని ట్వీట్ చేశాడు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంటూ డిసెంబర్ 28న చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిందని…. అయితే లక్షణాలు మాత్రం కనిపించడం లేదని అప్పుడు చరణ్ తెలిపాడు. హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నానని చెప్పాడు. ఇప్పుడు కరోనా నెగిటివ్ రావడంతో మెగా ఫాన్స్ ఖుషి అవుతున్నారు.