July 26, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

ఈ పుట్టినరోజు ఒక మెమరబుల్ డే : డా. నరేష్ వీకే

1 min read

????????????????????????????????????

????????????????????????????????????

“ప్రేమ సంకెళ్లు” తో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంటర్ అయి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్న వికే నరేష్ ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నూట యాభై చిత్రాలకు పైగా నటించి సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. ముందుకు దూసుకుపోతున్నారు. కళల పట్ల తనకున్న ప్యాషన్తో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ.. మరో ప్రక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఆదక్షుడిగా తనవంతు భాద్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా పాండమిక్ టైంలో తోటి కళాకారులకు తనవంతు సాయం చేసి ఎంతోమందిని ఆదుకున్నారు. అంతటి సేవా దృక్పధం కలిగిన నవరసరాయ డా. నరేష్ వీకే పుట్టినరోజు జనవరి 20. ఈ సందర్బంగా ఆయన పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో అభిమానులు, శ్రేయోభిలాషులు మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో న్యూ మన్క్స్ కుంగుఫు అసోసియేషన్ ను తెలంగాణలో ప్రారంభించారు. దీనికి నరేష్ వీకే ను అధ్యక్షునిగా నియమించారు. అలాగే ఈ కార్యక్రమంలో 2021 సంవత్సరానికి గాను 9వ యాన్యువల్ బుద్ధ బోధి ధర్మ అవార్డ్స్ ని ప్రముఖ సినీ నటులకు తెలంగాణ రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ ఫౌండర్ డా.యం యన్ రవికుమార్, వైస్ ప్రెసిడెంట్స్ శ్యామ్ సుందర్ గౌడ్, కోడి శ్రీనివాసులు జెనరల్ సెక్రెటరీ కృష్ణకుమార్ రాజు, 9వ యాన్యువల్ బుద్ధ బోధి ధర్మ అవార్డ్స్ గ్రహీతలు ఇంద్రగంటి మోహనకృష్ణ, ఆలీ, రాజీవ్ కనకాల, సాంసృతిక వేత్త ధర్మారావు, పవిత్ర లోకేష్, టార్జాన్, యం. అశోక్ కుమార్, గణేష్, గౌతమ్ రాజు, కరాటే కల్యాణి, జాకీ, కృష్ణమోహన్, శ్రీనివాసులు పసునూరి, శ్రీపురం కిరణ్ తదితరులు పాల్గొనగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు.

వైస్ ప్రెసిడెంట్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ..’ న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు నరేష్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడంతో యాభై శాతం సక్సెస్ అయినట్లుగా భావిస్తున్నాం. నరేష్ గారిలాంటి వ్యక్తి మాకు సపోర్ట్ గా ఉంటే ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా.. ఎంతోమందికి ఉపయోగకరంగా కుంగుఫు ఉంటుంది. విద్యార్థి దశనుండే కుంగుఫు నేర్చుకున్నట్లయితే శరీరం దృడంగా ఉండటమే కాకా సెల్ఫ్ డిఫెన్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ లో ఉన్నతమైన శిఖరాలకు పౌరులను తీర్చిదిద్దుతాము. ఇబ్రహీంపట్నంలో మార్చి 8నుండి స్టార్ట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కుంగుఫు ఇష్టపడి నేర్చుకునే వారికి స్తానం కల్పించి.. మాస్టర్స్ తో ట్రైనింగ్ ఇప్పించి అసోసియేషన్ లో సభ్యులుగా తీర్చిదిద్దుతాం. అలాగే వచ్చే అకడమిక్ ఇయర్ కల్లా గ్రామ గ్రామాల్లో న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ విస్తృతంగా వ్యాపింపజేస్తాం.. అన్నారు.

నవరసరాయ డా. నరేష్ వీకే మాట్లాడుతూ.. 1979లో నేను కూడా కుంగుఫు నేర్చుకున్నాను.. బెల్టులు దాకా వెళ్ళలేదు కానీ తొలి దెబ్బ సినిమాలో ఫైట్స్ సీన్లలో కుంగుఫు వాడం. మా అమ్మ విజయనిర్మల గారి ఆశీర్వాదం.. మా గురువు జంధ్యాల, ఈవివి గారి ప్రోత్సహంతో ప్రేమ సంకెళ్లు, నాలుగు స్థంబాలాట నుండి వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించాను. మధ్యలో కొంత బ్రేక్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు యస్వి రంగారావు గారు గుర్తుకొచ్చారు.. ఆయనలా గొప్ప పాత్రలు చేయాలి అని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు నూట యాభై చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాను. నేను ఊహించని వెరైటీ పాత్రలు చేస్తున్నాను. కరోన టైమ్ లో కమిటీ అయిన 11 చిత్రాలు పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక పది చిత్రాల్లో డిఫరెంట్ వెరీయేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. అందులో ఒకటి నేను ఆలీ హీరోలుగా చేస్తున్న ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రేమ సంకెళ్లు నుండి గొప్ప గొప్ప దర్శకులతో పనిచేశాను. ఆ జర్నీ మరువలేనిది. ఇప్పుడు ఎంతో మంది యువ దర్శకులతో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. 49 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా నన్ను సెలెక్ట్ చేసి సపోర్ట్ చేస్తున్న నిర్మాత దర్శకులకు నా కృతజ్ఞతలు. ఒక కళాకారుడికి అలసట అనేది ఉండదు. అందర్నీ ఎంటర్టైన్ చేయడమే మా పని. ‘మా’ అసోసియేషన్ ను పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకుపోతున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మా యాంతం కూడా ఒకటి చేశాం. కుంగుఫు అనేది మనిషికి ఎంతో అవసరం. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన విద్య. అలాంటి ఈ విద్యను రాష్ట్ర నలుమూలలా విస్తరింపజేసెలా నా వంతు కృషి చేస్తాను. నా మీద నమ్మకంతో న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ లో నాకు ఒక బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో రెండు మూడేళ్ళలో కుంగుపు ను అద్భుతమైన స్థాయికి తీసుకెళతాం. ఈ అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరికి నా థాంక్స్. ఇది నా లైఫ్ లో వండర్ ఫుల్ మెమరబుల్ డే గా నిలుస్తుంది.. విచ్చేసిన అభిమానులు తోటి కళాకారులు అందరికీ నా ధన్యవాదాలు.. అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ నటుడిగా అనేక రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్ నిజజీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. న్యూ మంక్స్ కుంగుఫు తెలంగాణ అసోసియేషన్ కు నరేష్ అధ్యక్షునిగా ఉన్నందుకు అభినందిస్తున్నాను. భారతదేశం వ్యాప్తంగా కుంగుఫు విద్యను విస్తృతం చేస్తున్న న్యూ మంక్స్ కమిటీకి శుభాకాంక్షలు. పాఠశాలల్లో చదివే పిల్లల నుండి మొదలు పెట్టి పెద్దవాళ్ళకు లేడీస్ కి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తే ఇది ఎంతో ఆరోగ్యకరమైన విద్యగా అందరికీ ఉపయోగపడుతుంది. సినిమా పరిశ్రమకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఒక టూరిజం డిపార్ట్మెంట్ మంత్రిగా సినిమా షూటింగ్ లకు తెలంగాణలో అందమైన లొకేషన్స్ ఉన్నాయి. కేటీఆర్ గారి సహకారంతో అతి తక్కువ ధరకు లొకేషన్స్ ఇచ్చి సినిమా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాడనికి మా ప్రభుత్వం రెడీగా ఉంటుంది. అలాగే ప్రతి మున్సిపాలిటీ గ్రౌండ్స్ లో కుంగుఫు టోర్నమెంట్స్ ఎక్కడ పెట్టినా ఫ్రీ ఆకాంబిటేషన్స్ కల్పించి మా ప్రభుత్వం ప్రోత్సహించి సహకరిస్తాం.. అన్నారు… అనంతరం సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ నేషనల్ అభిమాన సంగం అధ్యక్షుడు దిడ్డి రాంబాబు, ఖాదర్ గోరి సమక్షంలో భారీగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies