May 23, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

నెట్ ఫ్లిక్స్ చెబుతున్న తెలుగు పిట్ట కథలు

1 min read

 

ఆధునిక స్వాతంత్ర్య‌ భావాలు గల విలక్షణమైన మహిళల గురించి ఒక కథా సంకలనాన్ని నడిపించడానికి అద్భుతమైన ప్రతిభావంతులైన న‌లుగురు ద‌ర్శ‌కులు నాగ్ అశ్విన్‌, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంక‌ల్ప్‌ రెడ్డిల‌ను ఒక చోట చేర్చింది నెట్‌ఫ్లిక్స్‌.

నెట్‌ఫ్లిక్స్ ఈరోజు త‌న మొద‌టి ఒరిజ‌న‌ల్ తెలుగు ఫిలిం ‘పిట్ట‌క‌థ‌లు’ ప్ర‌క‌టించింది. ఈ నాలుగు భాగాల ఆంథాల‌జీ చిత్రానికి న‌లుగురు తెలుగు సినిమా అత్యుత్తమ ద‌ర్శ‌కులు నాగ్ అశ్విన్‌, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంక‌ల్ప్‌ రెడ్డిలు దర్శకత్వం వహించారు. సాధార‌ణంగా తెలుగులో చిన్న చిన్న క‌థ‌ల‌ను పిట్ట‌క‌థ‌లు అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల న‌లుగురు మ‌హిళ‌ల గురించి చెబుతుంది. ఈ నాలుగు పాత్ర‌ల‌కు ప్రాణం పోయ‌డానికి ఈషా రెబ్బా, లక్ష్మి మంచు, అమ‌లా పాల్‌, మ‌రియు శృతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. అలాగే అషిమా న‌ర్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, స‌త్య‌దేవ్‌, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

రోనీ స్క్రూవాలా యొక్క RSVP మూవీస్ మరియు ఆశి దువా సారా యొక్క ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన `పిట్టకథలు` 190 దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.

నేష‌న‌ల్ ఫిలిం అవార్డు గ్రహీత తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “పిట్ట కథలు ఫిలింలోని ప్ర‌తి క‌థ దేశంలోని ఒక్కో అందమైన సంస్కృతిని ఆవిష్కరిస్తుంది. మహిళల నేతృత్వంలోని ఈ కథలు ప్రేక్షకులను అల‌రిస్తాయి. ఎంతో ప్రతిభావంతులైన దర్శకులతో, నటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రాంతీయ భారతీయ కంటెంట్ ను ప్రపంచ వేదికపై ప్రకాశింప‌జేసే స‌మ‌యం” అన్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు బి.వి.నందిని రెడ్డి తన మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం గురించి మాట్లాడుతూ – “నెట్‌ఫ్లిక్స్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిట్ట‌క‌థ‌లు చిత్రానికి ఇంత మంచి తారాగ‌ణం కుద‌ర‌డం నిజంగా గొప్ప విష‌యం. కొత్త మార్గాల్లో ప్రయాణించాలనుకునే ప్రతిభావంతులైన దర్శకులతో క‌లిసి ప‌ని చేయ‌డం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మానవ సంబంధాలను, కథలను సహజంగా, ఒక కొత్త కోణంలో చూపించడానికి దోహద పడింది. నెట్‌ఫ్లిక్స్ లాంటి భారీ వేదిక ఈ క‌థ‌ల‌ను గ్లోబల్ ప్రేక్షకులకు దగ్గిర చేస్తుంది.” అన్నారు.

ఫిలింఫేర్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – “ నెట్‌ఫ్లిక్స్ మొదటి తెలుగు ఒరిజినల్ ఫిలిం పిట్ట‌క‌థ‌లు, ప్రేక్షకుల అభిరుచిని మరింత విస్తృత పరిచేలా ఉంటుంది . ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు సృష్టించిన నాలుగు వేర్వేరు కథలు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రికీ కనెక్ట్ అవుతాయి“ అన్నారు.

నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ – “నా మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం పిట్టకథలు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాలుగు కథలు నాలుగు ప్రత్యేకమైన ఇతివృత్తాలతో క‌లిగి ఉండి ప్రేక్షకుల‌కు ఆసక్తి కలిగిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రేక్షకుల వ‌ర‌కు ప్రయాణించగలవని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు

నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ సృష్టి బెహ్ల్ ఆర్య మాట్లాడుతూ – “గొప్ప కథలు ఎక్కడి నుండైనా రావచ్చు. మేము దేశం న‌లుమూల‌లకు చెందిన క‌థ‌ల‌ను చెప్పి మా ఫిల్మ్ స్లేట్‌ను విస్తరించాల‌నుకుంటున్నాము. ఈ క్ర‌మంలో భిన్నమైన శైలి కలిగిన తెలుగు స్టోరీ టెల్లింగ్ ను ‘పిట్టకథలు’ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సభ్యుల కోసం ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం“ అన్నారు.

పిట్ట‌క‌థ‌లు 19 ఫిబ్ర‌వ‌రి 2021 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండ‌నుంది

*టైటిల్ : రాముల‌*

న‌టీన‌టులు: మ‌ంచు ల‌క్ష్మి, సాన్వే మేఘ‌న‌, న‌వీన్ కుమార్‌,

ర‌చ‌న‌‌, ద‌ర్శ‌క‌త్వం: త‌రుణ్ భాస్క‌ర్‌.

 

*టైటిల్‌: మీరా*

న‌టీన‌టులు: జ‌గ‌ప‌తిబాబు, అమ‌లాపాల్‌, అశ్విన్ క‌క‌మ‌ను,

ర‌చ‌న‌: రాధిక ఆనంద్‌,

ద‌ర్శక‌త్వం: బి.వి నందిని రెడ్డి.

 

*టైటిల్‌: ఎక్స్ లైఫ్‌*

న‌టీన‌టులు: శృతిహాస‌న్‌, సంజిత్ హెగ్డే, సంగీత్ శోభ‌న్, అనీష్ కురువిల్లా, యుకెఒ, ద‌యానంద్ రెడ్డి, త‌న్మ‌యి..

ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం: నాగ్ అశ్విన్‌,

 

*టైటిల్‌: పింకీ*

న‌టీన‌టులు: స‌త్య‌దేవ్‌, ఈషా రెబ్బ‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, అశిమా న‌ర్వాల్‌,

ర‌చ‌న‌: ఎమ‌ని నంద‌కిషోర్‌

ద‌ర్శ‌క‌త్వం: స‌ంక‌ల్ప్ రెడ్డి.

 

నెట్‌ఫ్లిక్స్ గురించి

నెట్‌ఫ్లిక్స్ 190 కి పైగా దేశాలలో 195మిలియన్లకుపైగా సభ్యత్వాలతో మూవీస్‌, టీవీ సిరీస్‌లు, డాక్యుమెంటరీల‌ను అందిస్తోంది. సభ్యులు తమకు కావలసిన కంటెంట్‌ను ఇంటర్నెట్-కనెక్ట్ స్క్రీన్తో ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. సభ్యులు వాణిజ్య ప్రకటనలు లేకుండా పాజ్ చేయడం మరియు చూడటం తిరిగి ప్రారంభించవచ్చు.

 

RSVP గురించి

మనం చెప్పవలసిన, చెప్పడానికి ఇష్టపడే కథలను అభివృద్ధి చేయడం మరియు సృష్టించడం

RSVP యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ క్ర‌మంలో RSVP విజయవంతంగా లవ్ ఫ‌ర్ స్క్వేర్ ఫూట్, లస్ట్ స్టోరీస్, కార్వాన్, పిహు, కేధార్‌నాథ్, ఉరి – ది సర్జికల్ స్ట్రైక్, సోంచిరియా, రాత్ అకేలి హై, ది స్కై ఈజ్ పింక్ మరియు మర్ద్‌కొ ద‌ర్ద్ నాహి హోతా వంటి చిత్రాల‌ను నిర్మించింది.

ఈ బేన‌ర్‌లో రాబోవు చిత్రాలు రష్మి రాకెట్, తేజస్, పిప్పా మరియు సామ్ మానేక్షావ్‌

ఫ్లయింగ్ యునికార్న్ గురించి

ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆషి దువా సారా చేత స్థాపించబడిన ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ. ఆమె మొదట బొంబాయి టాకీస్ మరియు తరువాత లస్ట్ స్టోరీస్‌తో కలిసి భారతదేశంలో ఆంథాలజీ ఫిల్మ్ కళా ప్రక్రియకు మార్గదర్శకత్వం వహించారు ప్ర‌స్తుతం జోయా అక్తర్, దిబకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్ మరియు కరణ్ జో హార్ వంటి నలుగురు బాలీవుడ్‌లో అతిపెద్ద దర్శకులలో క‌లిసి ప‌ని చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన కాలాకాండిని కూడా ఫ్లయింగ్ యునికార్న్ నిర్మించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies