కొత్త ఏడాదిలో లిప్ లాక్ తో షాకిచ్చిన శ్రియ ?

సౌత్ క్రేజీ హీరోయిన్ శ్రియ .. అప్పట్లో ఓ రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చుకుందో అందరికి తెలుసు. ఈ మద్యే వరుస పరాజయాలతో అవకాశాలు తగ్గడంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్య ఎక్కడ కనిపించని శ్రియ.. సడన్ గా అందరికి షాక్ ఇచ్చేలా ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ లో లిప్ లాక్ స్టిల్ పోస్టుతో షురూ చేసింది శ్రియా. తన భర్త ఆండ్రీతో లిప్‌లాక్ చేసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన శ్రియ..అన్ని ముద్దులు, హగ్స్ మీకు పంపిస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఏడాది శ్రియ పెట్టిన మొదటి పోస్టు ఇదే కావడం విశేషం. ఆండ్రీ కొచీవ్ రష్యన్ టెన్నిస్ ప్లేయర్. ఆర్గానిక్ ఫుడ్స్ చైన్ రెస్టారెంట్స్ ను కూడా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే చాలా సార్లు తన భర్త తో మూతి ముద్దుల ఫోటోలు పెట్టిన శ్రియ.. ఈ ఏడాది మొదట్లోనే ముద్దులతో మొదలెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రేండింగ్ లో ఉన్నాయి.