బస్టాప్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ?
1 min readఅచ్చ తెలుగు హీరోయిన్ .. ఈ రోజుల్లో, బస్‌స్టాప్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన అమ్మాయి ఆనంది. వరంగల్
కు చెందిన ఈమె హీరోయిన్ గా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఆనంది పెండ్లి పీటలెక్కింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది తెలుగు అబ్బాయిని కాదు.. తమిళ కోడైరెక్టర్ సోక్రటిస్-ఆనంది వివాహబంధంతో ఒక్కటయ్యారు. వరంగల్ లోని కన్వెన్షన్ సెంటర్ లో బంధువులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆనంది వివాహవేడుక జరిగింది. బస్ స్టాప్ చిత్రం తర్వాత ఆనందికి గ్లామరస్ రోల్స్ వస్తుండటంతో కోలీవుడ్ పై ఫోకస్ పెట్టి మంచి హిట్స్ ఖాతాలో వేసుకుంటుంది. సోక్రటిస్ ప్రస్తుతం అగ్ని సిరాగుగల్ చిత్రానికి కోడైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆనంది కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఆమె చాలా గ్యాప్ తరువాత తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జాంబిరెడ్డి లో నటిస్తుంది.