నయనతార పెళ్లి కన్ఫర్మ్ అయిందా ?
1 min readసౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి మొత్తానికి కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే ఆమె పెళ్లి విషయం పై తాజాగా నయనతార రెస్పాండ్ అవ్వడంతో ఆమె పెళ్లి పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్లయింది. గత కొన్ని రోజులుగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార మధ్య ప్రేమాయణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ సైతం ఆసక్తి గా ఎదురుచూస్తుంది. కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే విఘ్నేష్-నయన్ ఈ ఫిబ్రవరిలోనే వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారట. ఈ పెళ్లి హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని టాక్.