హైద్రాబాద్ కు మకాం మార్చనున్న మోనాల్ ?

బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ క్రేజ్ బాగా మారిపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో అప్పటినుండి మోనాల్ కు ఊహించని క్రేజ్ దక్కింది. దాంతో ఈ అమ్మడికి ఇప్పుడు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఆ సాంగ్ తో పాటు మరిన్ని ఛాన్సులు కూడా ఉండడంతో ముంబై లో ఉంటున్న మోనాల్ హైద్రాబాద్ కు షిఫ్ట్ అయ్యే సన్నాహాల్లో ఉందట. ‘సుడిగాడు’ చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన మోనాల్ గజ్జర్..తెలుగు, తమిళం, మరాఠి, గుజరాతీ భాషల్లో పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పాపులర్ కాలేదు. కానీ ఈమె బిగ్ బాస్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్ చేసింది. దీనికి గాను భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంది.