December 3, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

విజయ రాఘవన్ టీజ‌ర్‌ విడుదల


నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త ఏడాదిని పురస్క‌రించుకుని ఈ సినిమా టీజ‌ర్‌ను శ‌నివారం చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

‘‘ఎవ‌డ‌య్యా వాడు అని ఓ వాయిస్ అడిగిన‌ప్ర‌శ్న‌కు…పేరు విజ‌య రాఘ‌వ‌న్ అండి.. మా ఏరియా ట్యూష‌న్ మాస్ట‌ర్’’ అని హీరో ఇంట్ర డ‌క్షన్‌తో టీజ‌ర్ మొద‌లైంది. విల‌న్స్, వాళ్ల‌తో హీరో విజ‌య్ ఆంటోని ఫైట్‌, పాట‌ల్లో స్టెప్పులేయ‌డం వంటి స‌న్నివేశాల‌తో పాటు ‘వాడొక వేస్ట్ గాడ‌న్న‌’ అని విలన్ అంటే గాజుముక్క కూడా వేస్టేరా , కానీ కంట్లో పడితే రక్తంగా మారుతుంది’ అని విలన్ హీరో గురించి ఇచ్చే బిల్డప్ కొన్ని యాక్షన్ సీన్స్ తో ‘విజయ రాఘవన్..విజయానికే నాయకన్’ అనే సాంగ్ బ్యాగ్రౌండ్‌గా టీజర్ ఉంది. ఇది వరకు విజయ్ ఆంటోని చేసిన చిత్రాలకు ఢిఫరెట్‌గా ‘విజయ్ రాఘవన్’ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.

విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌, ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌, రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *