రజనీకాంత్ ప్రకటనతో … టెన్షన్లో పడ్డ శ్రీ రెడ్డి ?

టాలీవుడ్ లోనే కాదు అటు కోలీవుడ్ లో కూడా పెద్ద దుమారం రేపి సంచలన స్టార్ గా మారిన శ్రీ రెడ్డి .. తాజాగా రజనీకాంత్ ప్రకటనతో గుక్కపట్టి ఏడ్చిందట. రజనీకాంత్ .. ప్రకటనతో శ్రీ రెడ్డి ఎందుకు ఏడ్చిందంటారా? అసలు విషయం ఏమిటంటే .. సూపర్ స్టార్ రజినీకాంత్ 20 ఏళ్లుగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఆయన పార్టీ పెడితే జాయిన్ అవ్వాలని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ పార్టీ ప్రకటించబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం చెప్పడంతో అందరిలో ఆనందం కట్టలు తెంచుకుంది.
రజినీకాంత్ అనారోగ్యం కారణం చెప్పి రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో ఇక రజినీకాంత్ రాజకీయాల్లోకి రాడు అని తెలుసుకుని చాలా మంది అభిమానులు బాధ పడ్డారు. అందులో శ్రీ రెడ్డి కూడా ఉంది. తాజాగా ఈ సంచలన తార శ్రీరెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్లుగా రజినీకాంత్ సర్ పార్టీ పెడితే జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఆయన చేసిన ప్రకటన తీవ్ర నిరాశ పరిచింది. రాజకీయాల్లో కి ఆయన రాను అంటూ చేసిన ప్రకటనతో నేను గుక్క పట్టి ఏడ్చేశాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.