June 6, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

గుణశేఖర్ శాకుంతలంగా .. స్టార్ హీరోయిన్ ?

1 min read

గత కొన్ని రోజులుగా గుణశేఖర్ అనౌన్స్ చేసిన శాకుంతలం అనే సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించే ఈ సినిమా పోస్టర్ కూడా విడుదల చేసారు. అయితే ఇందులో టైటిల్ రోల్ పోషించే హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మిగిలింది. భారీ సినిమాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న గుణశేఖర్ చాలా గ్యాప్ తరువాత తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయాన్ని కూడా గుణశేఖర్ ప్రకటించాడు. మహాభారతం ఆది పర్వంలోని ఒక భాగమైన శకుంతల కథను ఈ సినిమాకు స్ఫూర్తిగా తీసుకున్నారు. విశ్వామిత్ర కుమార్తె శకుంతల, దుశ్యంతల మధ్య ప్రేమకథను ప్రధానంగా ఈ చిత్రంలో టచ్ చేయనున్నారు.

మరి ఇందులో శాకుంతలంగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇప్పుడు దాదాపు క్లారిటీ వచ్చేసింది ? ఎందుకంటే అధికారికంగా సమంతనే శాకుంతలం పాత్రలో నటించబోతోంది అని తెలిపారు. నిజానికి ఈ సినిమాలో ముందు పూజ హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నా చివరికి సమంతకే గుణశేఖర్ ఓటు వేసాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *