July 26, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

పవన్ కోసం రంగంలోకి దిగిన త్రివిక్రమ్


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా, రచయితగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అయన తాజాగా తన మిత్రుడు పవన్ కల్యాణ్ కోసం కలం పడుతున్నాడు. మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడీ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు సంభాషణలను కూడా రాస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సెల్యులాయిడ్ మెజీషియన్ కి తమ సినిమా కుటుంబ పరివారంలోకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ సోషల్ మీడియాలో పేర్కొంది. జనవరి 22 నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని కూడా తెలిపింది. ఇక గతంలో పవన్ నటించిన ‘తీన్మార్’ సినిమాకి కూడా త్రివిక్రమ్ మాటలు రాసిన సంగతి చాలామందికి తెలిసిందే. ఇదిలావుంచితే, ఓపక్క క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తున్న పవన్.. ఈ మలయాళ రీమేక్ కి 40 రోజుల డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies