సంక్రాంతి వేడుకల్లో హీరో విశాల్ ?

తెలుగు వారి అచ్చ తెలుగు పండగ.. సంక్రాంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో జరుగుతాయో అందరికి తెలుసు. తాజాగా సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో నిర్వహించిన కోడి పందాల్లో కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్ సందడి చేశారు. గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రులోని శ్రీ భూ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన అయన ప్రత్యేక పూజలు చేశారు. మేఘా సంస్థ ఎండీ, ఆలయ నిర్మాత పీవీ కృష్ణారెడ్డితో కలిసి స్వామివారి దైనందిని, కాలమానిని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోడి పందాలను అందరూ కలిసి తిలకించారు. విశాల్ వచ్చిన విషయం తెలిసి అభిమానులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.