క్రాక్ రీమేక్ కోసం భరిలో ఇద్దరు స్టార్స్ ?

తెలుగులో యావరేజ్ టాక్ వస్తేనే హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్న బాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు రవితేజ హీరోగా వచ్చిన సూపర్ హిట్ క్రాక్ ని హిందిలో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారు? అయితే ఈ సినిమా విషయంలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఏర్పడిందట ? కరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలలు సినిమా హాల్స్ ముథ పడ్డాయ్. మళ్ళీ థియటర్స్ కు జనాలను రప్పించిన సినిమా సోలో బ్రతుకే సో బెటరు. ఆ తరువాత సంక్రాంతి సందడిని చూపించి థియటర్స్ ని దద్దరిల్లేలా చేసిన చిత్రం మాత్రం క్రాక్ అని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటించిన ఈ సినిమా ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. దర్శకుడు గోపీచంద్ మలినేని కి వరుస ప్లాపుల తరువాత కొత్త ఎనర్జీని ఇచ్చిన సినిమా క్రాక్. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచనలో గోపీచంద్ మలినేని ఉన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ‘క్రాక్’ సినిమా చూసిన బాలీవుడ్ హీరోలు ఈ రీమేక్ లో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అయితే ఈ కథలో పోలీస్ ఆఫీసర్ పాత్రకి అజయ్ దేవగణ్ గానీ .. రణ్ వీర్ సింగ్ గాని సరిపోతారని గోపీచంద్ మలినేని భావిస్తున్నాడు. ఎందుకంటే పోలీస్ పాత్రల్లో ఇద్దరూ మెప్పించినవారే. ముందుగా అజయ్ దేవగణ్ ను ఒప్పించే ప్రయత్నం చేసి, కుదరని పక్షంలో రణ్ వీర్ సింగ్ ను సంప్రదించాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. మరి బాలీవుడ్ లో ఏ హీరో క్రాక్ గా ఇమేజ్ తెచ్చుకుంటాడన్న విషయం తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.