గాడ్ ఫాధర్ గా బాలకృష్ణ ?
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారట ? బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం మే 28 న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాకముందే సినిమా విడుదల ప్రకటించి సంచలనం రేపారు. ఇక ఈ చిత్ర టైటిల్ విషయంలో అనేక పేర్లు ప్రచారం కాగా..తాజాగా మరో టైటిల్ బయటకొచ్చింది. సింహా, లెజెండ్ లాంటి వరుస హిట్స్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా హ్యాట్రిక్ సినిమా కాబట్టి టైటిల్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు టైటిల్స్ ని పరిశీలించిన టీమ్ ఫైనల్ గా గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది ? బాలయ్య ఇమేజ్‌కు, కథకు ఈ టైటిలే సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం నిర్ణయించింది. సో త్వరలోనే అధికారికంగా టైటిల్ ని విడుదల చేస్తారట ?