వేశ్యావా అంటూ దర్శకుడి కూతురిని బెదిరించారట ?

ఈ మధ్య బాహాటంగానే కొందరు హీరోయిన్స్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఏకంగా చంపేస్తాం అంటూ బెదిరించిన సంగటనలు ఇదివరకు విన్నాం.. తాజాగా బాలీవూడ్ దర్శకుడి కూతురుకి అలంటి బెదిరింపులు వచ్చాయి ? బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ఇటివల లోదుస్తులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఎంత వైరల్ అయ్యాయో.. ఆలియా కూడా అంతే ట్రోలింగ్ కు గురైంది. ఏకంగా ఆమెను వేశ్యగా సంబోధిస్తూ అత్యాచారం, హత్య చేస్తామంటూ బెదరింపులు వచ్చాయి. దీనిపై ఆలియా స్పందించింది. ‘ఇటువంటి బెదిరింపుల వల్లే నేనెంత సున్నిమైన వ్యక్తినో అర్ధమైంది. అతి చిన్న వ్యతిరేకతకు కూడా నేను ప్రభావితం అవుతున్నాను. ఈ బెదిరింపులకు నేనెంతో బాధ పడ్డాను’. ‘నన్ను రేప్ చేస్తామని, వేశ్యని, నా రేటు ఎంతని అడుగుతున్నారంటే.. ఇవన్నీ ఆ ఫోటోలు పోస్టు చేయడం వల్లే అని అర్ధమైంది. దీనివల్ల మానసికంగా కుంగిపోయినా.. పని లేనివాళ్లే ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడతారని అర్ధం చేసుకుని వారిని బ్లాక్ చేశాను’ అని అన్నారు.