మాస్టర్ తెలుగు మూవీ రివ్యూ
1 min read
సంగీతం: అనిరుధ్
కెమెరా : సత్యన్ సూర్యన్
మాటలు: రాజేష్ మూర్తి
నిర్మాత: జేవియర్ బ్రిట్టో
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నటీనటులు: తలపాటి విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ తదితరులు.
విడుదల : 13 – 01 – 2021
రేటింగ్ : 2. 5 / 5
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించిన హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మాస్టర్’. నగరం, ఖైదీ సినిమాలతో బిగ్గెస్ట్ గెట్స్ అందుకున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా ఎలా మెప్పించిందో చూద్దాం ..
కథ:
జెడి(విజయ్) ముందుకు బానిసగా మారిన ఒక ప్రొఫెసర్. కాలేజ్ కి తాగి వస్తూ ఉంటాడు, కానీ అతని యాక్టివిటీస్ కి, అతని మాటలకి కాలేజ్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే అతని స్టైల్ అండ్ మ్యానరిజమ్స్ చూసి అదే కాలేజ్ లో పనిచేసే మాళవిక మోహనన్ ప్రేమలో పడుతుంది. అక్కడ జరిగిన కొన్ని పరిస్థితుల వలన జువెనైల్ స్కూల్(బాల నేరస్తుల స్కూల్)కి పంపిస్తారు. ఆ ఏరియాకి గ్యాంగ్ స్టర్ అయిన భవాని(విజయ్ సేతుపతి) ఆ స్కూల్ పిల్లలని ఉపయోగించుకొని కొన్ని క్రైమ్స్ చేస్తుంటాడు. ఆ విషయంలో జెడి – భవాని మధ్య క్లాష్ వస్తుంది. అక్కడి నుంచి ఆ స్టూడెంట్స్ లో జెడి ఎలా మార్పు తీసుకువచ్చాడు. అలాగే భవాని క్రైమ్స్ ని ఎలా పాడు? ఎలా భవాని కథని జెడి ముగించాడు అనేదే కథ.
నటీనటులు :
ఈ సినిమాకి మొదటి హైలైట్, అందరిలోనూ అంచనాలు పెంచేసింది విజయ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్.. ఆ హైప్ కి తగ్గట్టుగానే ఇద్దరూ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ తో అభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చారు. ముందుగా విజయ్, తాగుబోతు ప్రొఫెషర్ గా చాలా ఫ్రెష్ లుక్ లో కనిపించి స్టైలిష్ అనిపించుకోవడమే కాకుండా తన మ్యానరిజమ్స్, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాడు. అలాగే మాస్ సీన్స్ లో తనదైన స్టైల్లో మెప్పించాడు. ఇక విజయ్ సేతుపతి విలన్ పాత్రలో పిచ్చెక్కించాడు అని చెప్పాలి. ప్రతి సీన్ లో, ఆ క్రూరత్వం చూపే ఎపిసోడ్స్ లో హావభావాలు సింప్లీ సూపర్బ్. విజయ్ కంటే విజయ్ సేతుపతికే ఈ సినిమాలో రెండు మార్కులు ఎక్కువ పడతాయి, ఎక్కువ పేరు కూడా వస్తుంది. స్పెషల్ గా విజయ్ సేతుపతికి రాసిన డైలాగ్స్ గురించి చెప్పాలి. ప్రతి డైలాగ్ కి ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. ఓవరాల్ గా సినిమా వేగం చాలా చోట్ల పడిపోయినా వీరి నటనే ఎంతో కాస్త ప్రేక్షకులకి ఊరటనిస్తోంది. మాళవిక మోహనన్ ఉన్నది తక్కువ సేపే అయినా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఆండ్రియా జెరెమియా పాత్రని సరిగా ఉపయోగించుకోలేదు. శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ లు తమ పాత్రల్లో మెప్పించారు.
టెక్నీకల్ హైలెట్స్ :
ఈ సినిమా మొత్తానికి మెయిన్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అని చెప్పాలి. సాంగ్స్ తో పాటు ఆర్ ఆర్ లోకూడా అదరగొట్టాడు. ఇక ఇప్పటికే సాంగ్స్ మంచి పాపులర్ అయ్యాయి. ముక్యంగా చిట్టి స్టోరీ సాంగ్ తో పాటు మాస్టర్ బీజీఎమ్ సూపర్బ్. ఇక సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఫోటోగ్రఫి విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే సినిమా లో ఎక్కువగా తమిళ్ నేటివిటీ కనిపించడంతో తెలుగు ప్రేక్షకులు ఆ ఫీల్ మిస్ అయ్యేలా ఉంది. వలకు ఢోకా లేదు. ‘మాస్టర్’ ఆద్యంతం భారీతనానికి లోటు లేదు. ముక్యంగా డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటె బాగుండేది. ‘ఖైదీ’ సినిమాతో కొత్త కథ,, కొత్త నేరేషన్ అంటూ అందరి ద్రుష్టి ఆకర్షించిన ఈ దర్శకుడు ఆ ఇంపాక్ట్ ని ఈ సినిమాతో మిస్ చేసుకున్నాడు. పెద్దగా ఆసక్తి లేని కథను ఎంచుకుని దాన్ని అంతే రేంజ్ లో చూపించే ప్రయత్నం చేసాడు. అయితే ముఖ్యంగా ద్వితీయార్ధంలో కథ.. స్క్రీన్ ప్లే సో సో గా అనిపిస్తుంది. కథనం విషయంలో మరింత జాగ్రత్త పడిఉంటే బాగుండేది.
ఫైనల్ గా :
కేవలం విజయ్ అభిమానుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఫక్తు కమర్షియల్ సినిమా తీశాడు దర్శకుడు. హీరో ఎలివేషన్ , బిల్డప్పులు , ముఖ్యంగా అవసరానికి మించి యాక్షన్ సన్నివేశాలు, సాంగ్స్ ఇలా కమర్షియల్ ప్యాకేజీ లా ఉంది కథను నమ్ముకుని చేసినట్టు లేదు. విలన్ పాత్రను తీర్చిదిద్దడంలో దర్శకుడి ప్రత్యేకత కనిపించినా.. మిగతా వ్యవహారమంతా రొటీన్ అయిపోవడం జరిగింది. కథ చాలా సింపుల్, కానీ కథనంలో ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఎంజాయ్ చేసేలా మ్యాజిక్ చేయడం లోకేష్ స్పెషాలిటీ. కానీ ఆ మ్యాజిక్ ఇందులో మిస్ అయ్యింది. ఎక్కడో తన మార్క్, విజయ్ కమర్షియల్ ఇమేజ్ మధ్యలో ఇరుక్కుపోయాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పరవాలేధనిపించినా సెకండాఫ్ మాత్రం చాలా చాలా బోర్ కొట్టించదమే కాకుండా మరీ మూస పద్దతిలో చెప్పడం ఇంకా చిరాకు తెప్పిస్తుంది. అందరూ భారీగా ఊహించుకున్న విజయ్ – విజయ్ సేతుపతి ఫియట్ కూడా పెద్ద కిక్ ఇవ్వలేదు.