రౌడీ హీరోతో రొమాన్స్ కి సై అంటున్న హీరోయిన్ ?

హీరో విజయ్ దేవరకొండ అంటే కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా సూపర్ క్రేజ్ ? ముక్యంగా పలు బాషల హీరోయిన్స్ సైతం ఈయనతో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన పూరి డైరెక్షన్లో లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటె తాజాగా ఈయనతో రొమాన్స్ చేయాలనీ ఉందని కొత్త హీరోయిన్ తన మనసులోని మాటను తెలిపి అబ్బా అనిపించింది. నవీన్ పొలిశెట్టితో కలిసి జాతిరత్నాలు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఫరియా అబ్దుల్లా. మార్చి 11న విడుదల కానున్న ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఈమె సినిమా విశేషాలతో పాటూ తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని , తనతో రొమాన్స్ చేయాలనీ ఉందని తన మనసులోని మాటను తెలిపింది.