ముక్కాలా మూకాబుల అంటూ చిందేసిన హాట్ యాంకర్ ?
ముక్కాలా మూకాబుల సాంగ్ అప్పట్లో ఏ రేంజ్ లో ఒక ఊపు ఊపేసిందో.. ఇప్పుడు అదే ఊపును కంటిన్యు చేస్తూ గ్లామర్ యాంకర్ అనసూయ చేసిన డాన్స్ కూడా ట్రేండింగ్ అవుతుంది ? జబర్డస్త్ షో తో ఎంతో పాపులర్ సాధించిన అనసూయ..కేవలం బుల్లితెర ఫై మాత్రమే కాకుండా వెండితెర ఫై , సోషల్ మీడియా లోను హల్చల్ చూపిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాల ఆరబోతతో పాటు తన వీడియోస్ షేర్ చేస్తూ ఆకట్టుకునే ఈమె..న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా జరుపుకుంది.
హోటల్‌లో తన ఇద్దరు పిల్లలతో కలిసి ముక్కాల ముక్కాబుల అనే సాంగ్‌కు చేసిన డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోకు ‘‘నా స్వీట్ బోయ్స్‌తో కాస్త మామ్ టైమ్’’ అని క్యాప్షన్ పెట్టారు. తల్లితో పాటు పిల్లలు కూడా చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తుండడం నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా అనసూయ చిందులు మాత్రం కేకలు పుట్టిస్తున్నాయి.