రివ్యూ– లవ్ ఓటిపి
రిలీజ్ డేట్– 14–11–2025
గుడ్ మోర్నింగ్ డియర్,
గుడ్ ఆఫ్టర్ నూన్ మై లవ్,
గుడ్ ఈవినింగ్ స్వీట్ హార్ట్,
గుడ్ నైట్ మై డియర్ బ్యూటీ….
ఇవే ప్రేమికుల చిలక పలుకులు..
ఇవి ఉంటేనే, ఇవి అంటేనే ప్రేమ?
ప్రస్తుత కాలంతో రోజు ఒకరిపై ఒకరికి ప్రేముంటే ఉండే ఫోన్ మాటల మూటలు ఇవి…
ఈ కాలం మెజార్టీ ప్రేమికుల ప్రేమ గురుతులు..
వాటి తాలుకూ ఊసులు…
ప్రేమంటే రెండు మన సుల గుసగుసలు..
ప్రేమంటే ఇరువురి పట్ల ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం..
అటువంటి ప్రేమ సోషల్ మీడియా టైమ్‌లో కలుషితమైందా? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది..
దానికి కారణం ఉంది….
నిజమైన ప్రేమ మనకు ఎదురయ్యే లోపు
నాలుగు అబద్దపు ప్రేమలు అలా వచ్చి ఇలా పలకరించి ముద్దాడి..వెక్కిరించి, వెళ్లిపోతాయి..
వెక్కివెక్కి ఏడ్చేలా చేస్తాయి..ఈ రోజుల్లో
నిజమైన ప్రేమను అనుభవిస్తున్నది ఎవరు?
అబద్దపు ప్రేమలో నలిగిపోతూ నోరు పెగలని వారెందరూ?
గుండెలోని బాధకు, నోటిలోకి మాటకు సంబంధమే లేకుండా మేము ప్రేమికులం… మేము ప్రేమించుకుంటున్నాం? అనే అబద్దంలో బతుకుతూ
అందమైన అబద్దాన్ని మోస్తున్నదెవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ‘‘ లవ్ ఓటిపి’’ ( లవ్ ఓవర్, ప్రెషర్, టార్చర్) సినిమా. తాను చేస్తున్నది లవ్ అనుకునే హీరోయిన్‌తో హీరో ఎలా ఫీలయ్యాడు? హీరో మరో హీరోయిన్‌కి ఎందుకు ఫిక్సయ్యాడు? ట్రైలర్లో చూపించినట్లు హీరోకి ఊపిరి ఆడనంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ప్రేమ విషయాలన్ని తెలియాలంటే ఖచ్చితంగా లవ్ ఓటిపి సినిమాని థియేటర్లో చూడాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇంత ఎంటర్టైనింగ్గా కూడా చెప్పొచ్చు అని తెలియచెప్పే చిత్రమిది. ఎన్నో ఎమోషన్స్‌తో ఉన్న కథనాన్ని సరదాగా ఆడుతూ పాడుతూ చెప్పేయొచ్చు అని నిరూపించిన దర్శకుడు– హీరో అనీష్ని మెచ్చుకోకుండా ఉండలేం. హీరో అక్షయ్ అలియాస్ అక్కి (అనీష్) తో పాటు తల్లి తండ్రులు ప్రమోదిని, సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ (రాజీవ్ కనకాల)లు కొడుకు అక్షయ్ క్రికెట్ ప్లేయర్ అవ్వటం కోసం సపోర్ట్ చేస్తుంటారు. అక్కి స్నేహితుడు వరుణ్ (నాట్యరంగ) పాత్ర బాగుంది. హీరోయిన్స్ ఇద్దరూ స్వరూపిణి (సన), జాన్విక (నక్షత్ర) తమ పాత్రలకు తగినట్లుగా అచ్చు గుద్దినట్లుగా సరిపోయారు. మిగతా పాత్రలన్నీ చక్కగా కుదిరాయి..
టెక్నికల్‌గా ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తెస్తుంది. తొలి సినిమాతోనే చక్కని కథతో ముందుకొచ్చిన భావప్రీతా ప్రొడక్షన్ అధినేత విజయ్ యం రెడ్డి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.
సినిమా ప్లస్‌లు–
కథ–కథనం
నటీనటుల నటన
కామెడీ టైమింVŠ
మైనస్–
రాజీవ్‌కి ప్రేమంటే ఎందుకు గిట్టదో చెప్పలేదు..
సెకండ్ హాప్లో అక్కడక్కడా అప్ అండ్ డౌన్స్
ఫైనల్ వర్డిక్ట్– ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్
Rating : 3.25 / 5
