Samyuktha Joins Ram Pothineni’s #RAPO23
రామ్ పోతినేని ‘#RAPO23’లోకి టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘#RAPO23’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా మరో ఆసక్తికరమైన చేరిక జరిగింది. టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త ‘#RAPO23’లో భాగమయ్యారు. సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలో ఆమె భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.
సంయుక్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, ఈ పోస్టర్ ద్వారా ఆమె సినిమాలో ఏ పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తిని కూడా ప్రేక్షకుల్లో పెంచారు. ఇప్పటికే ‘#RAPO23’ను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తుండటంతో.. సంయుక్త చేరిక సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
‘#RAPO23’ రామ్ పోతినేని కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. తన ఆలోచనలను తెరపైకి తీసుకురావడానికి రామ్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ, సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కథకు, పాత్రలకు తగ్గట్టుగా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకోవడంలో రామ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విజేత సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిర్రు) ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తన అద్భుతమైన విజువల్స్‌తో సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకురానున్నారు. ‘#RAPO23’కు సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాలకు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు విక్రమ్ మోర్, పీటర్ హెయిన్ నేతృత్వం వహిస్తున్నారు. సినిమా జానర్‌కు తగ్గట్టుగా యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ పోతినేని తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండటం, బలమైన సాంకేతిక బృందంతో పాటు సంయుక్త వంటి టాలెంటెడ్ హీరోయిన్ చేరడంతో ‘#RAPO23’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
