Pahalgam Love Story
Pahalgam Love Story Gets Grand Release on August 21
తెలుగు తెరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు కొంత విరామం తర్వాత తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం “పహల్గాం లవ్ స్టోరీ”. గాయత్రి కళా చిత్ర బ్యానర్‌పై పి.ఎన్. రామచంద్రరావు నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఇంటెన్స్ పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కృష్ణ మోహన్, చిత్రశుక్ల హీరో హీరోయిన్లుగా నటించారు. సుమన్, పూజా బిస్త్, జయప్రకాశ్ నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉండటంతో పాటు, కథలోని ప్రేమ, దేశభక్తి, యాక్షన్ అంశాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్‌లోని అందమైన, అరుదైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరపడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
మనసును హత్తుకునే ప్రేమకథతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒకవైపు రొమాంటిక్ ఎమోషన్‌ను చూపిస్తూనే, మరోవైపు ప్రేక్షకులను ఆలోచింపజేసే జాతీయ సమస్యను కథలో కీలకంగా ఆవిష్కరించినట్లు చిత్రబృందం తెలిపింది.
“పహల్గాం లవ్ స్టోరీ” కేవలం వినోదం కోసం రూపొందించిన చిత్రం మాత్రమే కాదు. మనలో దేశభక్తి భావనను మేల్కొలిపే ఒక ముఖ్యమైన జాతీయ సమస్యను ఈ సినిమాలో చూపిస్తున్నాం” అని దర్శక నిర్మాత పి.ఎన్. రామచంద్రరావు తెలిపారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, యాక్షన్, దేశభక్తి, కాశ్మీర్ అందాల కలయికగా తెరకెక్కిన “పహల్గాం లవ్ స్టోరీ” థియేటర్లలో ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.
