Crazy Kalyanam to Hit Theatres Worldwide on October 16
అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘క్రేజీ కళ్యాణం’
వీకే నరేష్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉద్దేమరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం
వీకే నరేష్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉద్దేమరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. అర్రో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గజుల దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా విడుదల తేదీలో మార్పు చేశారు. రెండు వారాల ముందుగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించిన మేకర్స్.. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
‘క్రేజీ కళ్యాణం’ ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా చిత్రంలోని లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన లభించడంతో పాటు, పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సినిమాపై బజ్‌ను మరింత పెంచాయి.
ఆకట్టుకునే కథాంశం, అనుభవజ్ఞులైన నటీనటులతో పాటు యూత్‌ను ఆకర్షించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ‘క్రేజీ కళ్యాణం’ ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
అక్టోబర్ 16న విడుదల తేదీ ఖరారు కావడంతో ‘క్రేజీ కళ్యాణం’ వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
