I Am Game
‘ఐయామ్ గేమ్’ నా ప్రొడక్షన్లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్.. తెలుగు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది: దుల్కర్ సల్మాన్
‘ఐయామ్ గేమ్’లోని కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.. ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది: నాగ్ అశ్విన్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ నిర్మించిన భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వేఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి సూపర్‌హిట్ ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ‘ఐయామ్ గేమ్’ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్, నటీనటులు, చిత్రబృందం పాల్గొన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..
“అందరికీ నమస్కారం. ‘ఐయామ్ గేమ్’ నా ప్రొడక్షన్లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్. నేను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో మాట్లాడుతున్నప్పుడు కూడా.. ఇది తెలుగులో తీసిన ఒక పెద్ద సినిమాలా ఉందని వారు అన్నారు. ఈ సినిమాలో ఉన్న ఒక ఎలిమెంట్ మీ అందరినీ కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది.
తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించే విధానం, సినిమాపై చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు.. ఇలా ఏ హీరో పేరు చెప్పినా ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా స్పందిస్తారు. సినిమా పట్ల తెలుగు ప్రేక్షకులకు ఉన్న ప్రేమ అలాంటిది.
మీ అందరి మనసుల్లో నాకు కూడా చోటు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ సినిమాతో కూడా మిమ్మల్ని అలరిస్తానని నమ్ముతున్నాను. ఈ సినిమాకు నేను స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాను.
నాగి ఈ సినిమాను చూశారు. అంతేకాదు, ఎడిటింగ్‌లో కూడా నాకు హెల్ప్ చేశారు. కాబట్టి సెప్టెంబర్ 3న ఈ సినిమాను తప్పకుండా థియేటర్లో చూడండి. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.
తెలుగులో ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మహానటి’ నా ఫేవరెట్. అది నాకు ఒక పాత్‌బ్రేకింగ్ సినిమా. నా తెలుగు కెరీర్‌కు క్రెడిట్ మొత్తం నాగి, స్వప్న, ప్రియాంకకే ఇస్తాను. ఈరోజు నేను నా సినిమాను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నానంటే దానికి కారణం కూడా వారే.
వైజయంతి సినిమా అంటే నాకు ఒక ఫ్యామిలీ లాంటిది. నాగి ఎప్పుడు కాల్ చేసినా తన సినిమాలో నటించడానికి నేను సిద్ధంగా ఉంటాను.”
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..
“అందరికీ నమస్కారం. దుల్కర్ నిర్మాతగా చేసిన ‘లోక’ సినిమా వేడుకకు గతంలో వచ్చాను. ఆ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఐయామ్ గేమ్’ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో దుల్కర్ నిర్మించడమే కాకుండా హీరోగా కూడా నటించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమాను నేను కొంత చూశాను. ఇందులోని కాన్సెప్ట్ ప్రేక్షకులందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉన్నాయి.
దుల్కర్ గారు మంచి సినిమాలను ఇష్టపడతారు. ‘మహానటి’ నుంచి ఆయనతో నా జర్నీ కొనసాగుతోంది. కథకు ఏం కావాలో అది ఇవ్వగలిగే నటుడు దుల్కర్. ఒక మంచి కథ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉంటారు.
సెప్టెంబర్ 3న ప్రేక్షకులు ఒక మంచి సినిమాను చూడబోతున్నారు. అందరూ థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.”
ఆంటోనీ వర్గీస్ మాట్లాడుతూ..
“అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.
హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి కల్చర్ నాకు చాలా నచ్చింది. ‘ఐయామ్ గేమ్’ తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను.”
నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ..
“దుల్కర్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ అద్భుతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘ఐయామ్ గేమ్’ టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా తప్పకుండా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”
కదిర్ మాట్లాడుతూ..
“అందరికీ నమస్కారం. ‘ఐయామ్ గేమ్’ పక్కా మాస్ ఎంటర్టైనర్. అదే సమయంలో ఇందులో అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది.
దుల్కర్ గారికి సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. కొత్త కథలు చెప్పేందుకు ఆయన ఎప్పుడూ రిస్క్ తీసుకుంటారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ గొప్ప ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నమ్ముతున్నాను.”
సంయుక్త విశ్వనాథన్ మాట్లాడుతూ..
“అందరికీ నమస్కారం. ‘ఐయామ్ గేమ్’ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమా ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఇందులో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. సెప్టెంబర్ 3న అందరూ థియేటర్లో సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.”
